Abn logo
Oct 23 2020 @ 08:21AM

దీక్షిత్ కిడ్నాప్, హత్య కేసులో అనేక అనుమానాలు

Kaakateeya

మహబూబాబాద్: మహబూబాబాద్ బాలుడు దీక్షిత్ కిడ్నాప్, హత్య వ్యవహారంలో అనేక అనుమానాలు తెరమీదకు వస్తున్నాయి. నిందితుడు మంద సాగర్‌కు బాలుడి బాబాయ్ మనోజ్ రెడ్డికి మధ్య సంబంధాలపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. నిందితుడు గతంలో పోలీస్ వాహనం నడిపే ప్రైవేటు డ్రైవర్‌గా పనిచేసినట్లు తెలుస్తోంది. మరోవైపు దీక్షిత్ మృతి పట్ల తల్లి వసంత కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. తనలాంటి కడుపుకోత ఏ తల్లికి రావద్దని తల్లడిల్లిపోతోంది. ఈ మర్డర్ మిస్టరీలో సాగర్‌తో పాటు ఎంతమంది ఉన్న వారిని ఎన్‌కౌంటర్ చేయాలని, లేదంటే బహిరంగంగా ఉరి తీస్తేనే ప్రతీ తల్లి తన బిడ్డలను నిర్భయంగా బయటకు పంపించగలుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ కోఠిరెడ్డి ఈ రోజు మరోసారి మీడియా సమావేశం నిర్వహించి పూర్తి వివరాలు వెళ్లడించనున్నారు. నిందితుడు సాగర్, బాలుడి తల్లిదండ్రులు ఇద్దరిదీ ఒకే గ్రామం పైగా పక్క పక్క ఇల్లే కావడం శనిగపురం గ్రామంలో పోలీస్ భద్రతను ఏర్పాటు చేశారు. 

Advertisement
Advertisement