Abn logo
Oct 31 2020 @ 17:54PM

30 శాతం తగ్గిన బంగారం గిరాకీ

Kaakateeya

హైదరాబాద్: ఓ వైపు కరోనా సంక్షోభం. మరోవైపు అధిక ధరలు. మొత్తంగా గిరాకీ లేక బంగారం దుకాణాలు వెలవెలబోతున్నాయి. వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లెక్కల ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా బంగారం వ్యాపారం తగ్గింది. ప్రస్తుతం పండుగలు, పెళ్లిళ్ల సీజన్ కావడంతో బంగారం దుకాణాలు కిటకిటలాడుతాయని అనుకున్నారు, కానీ కస్టమర్లు లేక ఇబ్బందులు పడుతున్నారు. కరోనా భయంతోనే షాపులకు రావడంలేదని బంగారం దుకాణాల యజమానులు అంటున్నారు. కోవిడ్ నిబంధనలకు అనుగుణంగానే షాపులు నిర్వహిస్తున్నామన్నారు. కస్టమర్లకు కావాల్సిన అన్ని జగ్రత్తలను ఏర్పాటు చేశామని చెబుతున్నారు. గతంతో పోల్చుకుంటే 30 శాతం వరకూ బంగారం గిరాకీ పడిపోయందని  అంటున్నారు. 


Advertisement
Advertisement