Abn logo
Oct 22 2021 @ 00:39AM

డీ ఫార్మశీ దరఖాస్తు గడువు 25వరకు పొడిగింపు

తిరుపతి(విద్య), అక్టోబరు 21: తిరుపతిలోని ఎస్వీ ప్రభుత్వ పాలిటెక్నిక్‌లో డిప్లొమా ఇన్‌ ఫార్మశీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు గడువు ఈనెల 25వ తేదీ వరకు పొడిగించినట్లు ఆ విభాగాధిపతి గల్లా కృష్ణమూర్తి నాయుడు తెలిపారు. ఇంటర్‌(ఎంపీసీ, బైపీసీ) పూర్తి చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. వివరాలకు 9848217166, 9553629005 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు.