Abn logo
Sep 24 2020 @ 01:52AM

బంద్‌కు మద్దతు: డీసీసీ అధ్యక్షుడు

మహబూబ్‌నగర్‌, సెప్టెంబరు 23: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన నూతన వ్యవసాయ బిల్లుకు వ్యతిరేకంగా ఈనెల 25న రైతు సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించే బంద్‌కు కాంగ్రెస్‌ పార్టీ సంపూర్ణ మద్దతు తెలుపుతోందని డీసీసీ అధ్యక్షుడు ఒబేదుల్లా కొత్వాల్‌ చెప్పారు. కాంగ్రెస్‌ పార్టీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గాంధీ కలలు కన్న గ్రామ స్వరాజ్యానికి వ్యతిరేకంగా బిల్లు ఉన్నందున గాంధీ జయంతి అక్టోబర్‌ 2న పార్టీ ఆధ్వర్యంలో నిరసనలు తెలిపి, కలెక్టర్‌కు వినతి పత్రం ఇస్తామని చెప్పారు. సంతకాల సేకరణ చేస్తామని తెలిపారు. ఈ బిల్లుతో చిన్న, సన్నకారు రైతులు తీవ్రంగా నష్టపోతారని చెప్పారు. సమావేశంలో నాయకులు ఎన్‌పీ వెంకటేశ్‌, బెక్కరి అనిత, లక్ష్మణ్‌ యాదవ్‌, సాయిబాబ, సుభాష్‌కత్రి పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement