Abn logo
Oct 14 2021 @ 01:17AM

దసరా వచ్చిందయ్యా!

  రేపే విజయదశమి  8 జిల్లావ్యాప్తంగా మార్కెట్లకు పండగ శోభ
  కళకళలాడుతున్న వస్త్ర, వాణిజ్య, ఎలకా్ట్రనిక్స్‌ దుకాణాలు
  కాకినాడ, రాజమహేంద్రవరం సహా జిల్లాలో రూ.50 కోట్లు దాటిన విక్రయాలు

 (కాకినాడ-ఆంధ్రజ్యోతి) జిల్లాలో ఈ ఏడాది దసర పండగ ఉత్సాహాన్ని నింపుతోంది. రకరకాల వస్తువుల కొనుగోళ్ల కోసం జనం మార్కెట్లకు పోటెత్తుతుండడంతో పండగ వాతావరణం నెలకొంది. కాకినాడ, రాజమహేంద్రవరం, అమలాపురం, మండపేట, రామచంద్రపురం, తుని, జగ్గంపేట తదితర ప్రాంతాలతోపాటు గ్రామాల్లోనూ దసరాకు జనం షాపింగ్‌లు చేస్తుండడంతో అన్ని వ్యాపారాలు రద్దీగా మా రాయి. గతేడాది దసరా సమయంలో కొవిడ్‌ తీవ్రత కొనసాగింది. ఆ సమయంలో రోజూ 700 నుంచి 800 వరకు పాజిటివ్‌లు నమోదయ్యేవి. దీంతో పండగ నాటికి పాజిటివ్‌ల సంఖ్య జిల్లాలో 1.13 లక్షలకు చేరుకున్నాయి. దీంతో జనం బయటకు రావడం మానేశారు. అనేక మందిపై కొవిడ్‌ ప్రభావంతో ఉపాధి కోల్పోయి ఆర్థికంగా చితికిపోవడంతో గతేడాది దసరా కళ పూర్తిగా తప్పిపోయింది. కానీ ఇప్పుడు జిల్లాలో కేసుల గణనీయంగా తగ్గిపోయా యి. ప్రస్తుతం రోజువారీ 80 నుంచి 90 వరకు మాత్రమే పాజిటివ్‌లు నమోదవుతున్నాయి. అటు కొవిడ్‌ ఆంక్షలు, పగటి కర్ఫ్యూ కూడా లేకపోవడంతో దసరా కొనుగోళ్లకు జనం పెద్దఎత్తున బయటకు వస్తున్నారు. దీంతో పండగ కళ పెరిగింది. కాకినాడ, రాజమహేంద్రవరంలో అయితే కార్లు, ద్విచక్రవాహనాల షోరూంలు కొనుగోళ్లతో కళకళలాడుతున్నాయి. అనేకమంది వాహనప్రియులు దసరా సెంటిమెంట్‌తో కొత్తవాహనాలు కొనుగోలు చేస్తున్నారు. జిల్లాలో 600 వరకు ద్విచక్రవాహనాల షోరూంలు ఉన్నాయి. దసరాకు ఇవన్నీ ఎక్సేంజీ మేళాలు, స్పెషల్‌ డిస్కౌంట్లు ప్రకటించాయి. దీంతో కొత్తవాహనాలు, పాతవి ఇచ్చి కొత్తవి తీసుకునే వారి సంఖ్య పండగకు బాగా పెరిగింది. ఈనెల ఒకటి నుంచి ఇప్పటివరకు కాకినాడలో ఒక్కో ద్విచక్రవాహన  షోరూం ఇప్పటివరకు సరాసరి 450 చొప్పున బైక్‌లు విక్రయించాయి. గతేడాది ఇందులో సగం కూడా కొనుగోళ్లు లేవని, ఈ దసరాకు మార్కెట్‌ పుంజుకుందని ఓ నిర్వాహకుడు వివరించారు. కాకినాడ, రాజమహేంద్రవరం నగరాల్లో కార్ల విక్రయాలు కూడా ఊపందుకున్నాయి. ఒక్కో షోరూం ఈ 13 రోజుల వ్యవధిలో సరాసరి 15 నుంచి 23 వరకు కార్లు విక్రయాలు జరిగాయని అంచనా వేశారు. అలాగే కొత్త టీవీలు, ఫ్రిజ్‌లు, వాషింగ్‌ మిషన్లు, ఏసీలు దసరా సెంటిమెంట్‌తో అనేకమంది కొనుగోలు చేస్తున్నారు. వీరికోసం దాదాపు అన్ని దుకాణాలు ప్రత్యేక దసరా డిస్కౌంట్స్‌ కూడా ప్రకటించాయి. కాకినాడ,రాజమహేంద్రవరంలో గడచిన పదమూడు రోజుల్లో రూ.15 కోట్ల వరకు విలువైన ఎలకా్ట్రనిక్స్‌ వస్తువుల వ్యాపారం జరిగిందని ఓ డీలర్‌ వివరించారు. అలాగే వస్త్రదుకాణాలు సైతం దసరా పండగ శోభతో కళకళాడుతున్నాయి. అన్ని రకాల దుకాణాలు వస్త్రాలపై పలు ఆకర్షణీయమైన ఆఫర్లు ఇవ్వడంతో అవన్నీ కొనుగోలుదారులతో కిటకిటాడుతున్నాయి. ఒకరకంగా ఇప్పటివరకు గడచిన పదమూడు రోజుల్లో పండగ వ్యాపారం రూ.50 కోట్లకు పైగా ఉందని వ్యాపార సంఘాలు విశ్లేషించాయి. దసరా రోజు జిల్లావ్యాప్తంగా మరో రూ.25కోట్లకుపైగా వాహనాలు, ఎలకా్ట్రనిక్స్‌, వస్త్రదుకాణాలు విక్రయాలు జరిపే అవకాశం ఉందని పేర్కొన్నాయి. పండగ నేపథ్యంలో మార్కెట్లు, దుకాణాలు కళకళలాడుతున్నా కొవిడ్‌ ముప్పు ఉందన్న సంగతి జనం మర్చిపోయారు. చాలాచోట్ల మాస్కులు ధరించడం, భౌతిక దూరం పాటించడం చేయడంలేదు. వాణిజ్య  దుకాణాలు సైతం శానిటైజర్లు, థర్మల్‌స్కానింగ్‌ గాలికి వదిలేశాయి. అజ్రాగత్తగా వ్యవహరిస్తుండడంతో మళ్లీ కేసులు పెరిగే ప్రమాదం ఉందని వైద్యఆరోగ్యశాఖ హెచ్చరిస్తోంది. ఆలయాలు, మార్కెట్లలో రద్దీ పెరుగుతోందని, దీంతో కేసుల తీవ్రత పెరిగే పరి స్థితి ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తోంది.