Abn logo
Aug 7 2020 @ 01:12AM

సైబర్‌ నేరాలు పెరుగుతున్నాయ్‌.. జాగ్రత్త

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): గత కొద్ది నెలలుగా తెలంగాణలోని వివిధ ప్రాంతాల్లో సైబర్‌ నేరాలు పెరిగాయి.  బ్యాంకు ఖాతాదారులు జాగ్రత్తగా ఉండాలని, బ్యాంకింగ్‌ లావాదేవీల సమయంలో ప్రాథమిక జాగ్రత్తలు తీసుకోవాలని తెలంగాణలోని ఖాతాదారులను కోటక్‌ మహీంద్రా బ్యాంకు కోరింది. కొవిడ్‌ అనంతరం బ్యాంకింగ్‌, ఫైనాన్స్‌ సేవల రంగంలో ఆన్‌లైన్‌ లావాదేవీలు పెరిగాయని, ఈ నేపథ్యంలో సైబర్‌ నేరాలు పెరిగాయని కోటక్‌ మహీంద్రా బ్యాంకు ప్రెసిడెంట్‌ పునీత్‌ కపూర్‌ తెలిపారు. సైబర్‌ నేరగాళ్లు ముఖ్యంగా కేవైసీ, రీ-కేవైసీ పేరుతో కీలకమైన సమాచారాన్ని ఖాతాదారుల నుంచి రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారని చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement