Abn logo
Sep 20 2020 @ 02:44AM

సైబర్‌ నేరాలు 500శాతం పెరిగాయి: అజిత్‌ దోభాల్‌

న్యూఢిల్లీ, సెప్టెంబరు 19: దేశంలో సైబర్‌ నేరాలు 500శాతం పెరిగాయని జాతీయ భద్రత సలహాదారు (ఎన్‌ఎ్‌సఏ) అజిత్‌ దోభాల్‌ వెల్లడించారు. ప్రజ ల్లో అవగాహన లేకపోవడం, గాడ్జెట్ల విషయంలో సైబర్‌ పరిశుభ్రత అంతంతమాత్రంగానే ఉండటమే ఇందుకు కారణమని ఆయన అభిప్రాయపడ్డారు. సెల్‌ఫోన్‌, కంప్యూటర్‌ వంటి పరికరాలను ఎలా భద్రపరుచుకోవాలో తెలియ కే ఈ పరిస్థితి నెలకొంటోందన్నారు. పెరుగుతున్నసైబర్‌ నేరాలను అడ్డుకునేందుకు‘జాతీయ సైబర్‌-సెక్యూరిటీవ్యూహం(ఎన్‌సీఎ్‌సఎ్‌స)-2020’తో కేంద్రం ముందుకు రానుందని వివరించారు. శనివారం ప్రారంభమైన ‘కోకోన్‌-2020’ సైబర్‌ సెక్యూరిటీ కాన్ఫరెన్స్‌లో ఆయన వర్చువల్‌గా కీలకోపన్యాసం చేశారు. 

Advertisement
Advertisement
Advertisement