Abn logo
Jul 11 2020 @ 05:20AM

లక్కీ డ్రా సైబర్‌ నేరాలు

అప్రమత్తంగా ఉండండి: ఎస్పీ ఫక్కీరప్ప కర్నూలు, జూలై 10: మీరు లక్కీ డ్రా గెలిచారు.. అంటూ మీ అడ్ర్‌సతో  లెటర్‌ వచ్చిందా..? జాగ్రత్తగా ఉండండి.. ఇటీవల ఇలాంటి సైబర్‌ నేరాలు జిల్లాలో పెరిగిపోయాయి..అప్రమత్తంగా ఉండండని ఎస్పీ ఫక్కీరప్ప శుక్రవారం సైబర్‌ అలర్ట్‌పై ఒక ప్రకటన విడుదల చేశారు. సైబర్‌ నేరస్తులు ఇలాంటి లెటర్‌ను పోస్టు ద్వారా పంపి, షాపింగ్‌ వెబ్‌సైట్‌లో వస్తువులను కొన్నందు వల్ల లక్కీ డ్రా కింద మిమ్మల్ని ఎంపిక చేశాం..


  వివరాలకు ఫలానా వాట్సాప్‌ నెంబర్‌ను సంప్రదించాలని సమాచారం వస్తుందని, దాన్ని నమ్మితే మోసపోతారని ఆయన తెలిపారు. మీరు గెలుచుకున్న డబ్బు పొందడానికి జీఎ్‌సటీ ఫీజు, ప్రొజెసింగ్‌ ఫీజులంటూ కొంత డబ్బులు కట్టమని అడుగుతారు.. ఇలా పలు దఫాలుగా ఫీజుల పేర్లు చెప్పి డబ్బు అకౌంట్‌లో వేయించుకున్నాక ఆ వాట్సాప్‌ అకౌంటు డీయాక్టివ్‌ అవుతుందని ఆయన తెలిపారు. ఇలాంటి విషయాల్లో జాగ్రత్త ఉండాలని పేర్కొన్నారు. ఏవైన అపరిచిత కాల్స్‌ వస్తే స్థానిక పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు. సందేహాలు, సమస్యలుంటే సైబర్‌ ల్యాబ్‌ పోలీసులకు గానీ, సైబర్‌ మిత్ర వాట్సాప్‌ నెంబర్‌ 9121211100ను సంప్రదించాలన్నారు. 


తీసుకోవాల్సిన జాగ్రత్తలు..

లాటరీ గెలుచుకున్నారంటూ వచ్చే పోస్ట్‌లను నమ్మకూడదు. గుర్తు తెలియని నకిలీ వెబ్‌సైట్‌లను నమ్మి మోసపోరాదు. అపరిచితుల ఫోన్‌ కాల్స్‌ నమ్మకూడదు. ఎవరైనా డబ్బును క్యూఆర్‌ కోడ్‌ రూపంలో పంపామంటే సిద్ధం కాకూడదు. పేటీఎం, గూగుల్‌పే, ఫోన్‌పే, బ్యాంక్‌ ఖాతా వివరాలు, పాన్‌కార్డు, ఆధార్‌కార్డు వివరాలు ఎవరికీ ఇవ్వకూడదు. వ్యక్తిగత వివరాలు, మీకు వచ్చిన ఓటీపీలను ఎవరికీ చెప్పకూడదు. 


Advertisement
Advertisement
Advertisement