Abn logo
Aug 8 2020 @ 00:59AM

ఇంటి వద్దకే ‘తాజ్‌’ వంటకాలు

హైదరాబాద్‌ (ఆంధ్రజ్యోతి బిజినెస్‌): తాజ్‌ హోటళ్లలోని వంటకాలను ఇంటి వద్దే భోజన ప్రియులకు అందించడానికి ఇండియన్‌ హోటల్స్‌ కంపెనీ (ఐహెచ్‌సీఎల్‌) ఫుడ్‌ డెలివరీ సేవలను ‘క్యూమిన్‌’ పేరుతో హైదరాబాద్‌లో ప్రారంభించింది. మొదటి దశలో హైదరాబాద్‌లో క్యూమిన్‌ సేవలను ప్రారంభించామని, తాజ్‌ ఫలక్‌నుమా ప్యాలె్‌సలోని అడ్డా, సెలెస్టే రెస్టారెంట్ల నుంచి ఆహార ప్రియులు ఇంటి వద్దకే పంటకాలను తెప్పించుకోవచ్చని తాజ్‌ కృష్ణ జనరల్‌ మేనేజర్‌ లాన్‌ దుబియర్‌ తెలిపారు. క్యూమిన్‌ మొబైల్‌ యాప్‌ ను త్వరలో విడుదల చేయనున్నట్లు చెప్పారు. 


Advertisement
Advertisement
Advertisement