Abn logo
Oct 15 2021 @ 01:28AM

మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గోదావరిలో మత్స్యకారుల వలకు చిక్కిన మొసలి

ఆత్రేయపురం, అక్టోబరు 14: గోదావరిలో వేటకు వెళ్లిన మత్స్యకారుల వలకు భారీ మొసలి చిక్కింది. ఆత్రేయపురం మండలం వద్దిపర్రు గోదావరిలోకి గురువారం స్థానిక మత్స్యకారులు భైరమూర్తి, గంగరాజు, మహేష్‌ తదితరులు వేటకు వెళ్లారు. వలకు భారీ మొసలి చిక్కింది. మొసలిని ఒడ్డుకు తీసుకువచ్చి తాళ్లతో కట్టి బంధించారు. స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. అటవీ వన్య సంరక్షణ అధికారులకు సమాచారం ఇచ్చారు. రాజమహేంద్రవరం ఫారెస్టు ఆఫీసర్‌ వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో మొసలిని ప్రత్యేకవాహనంలో తరలించారు. ఈ మొసలిని జూపార్కుకు తరలిస్తామన్నారు.