Abn logo
Oct 31 2020 @ 01:46AM

అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే విమర్శలు

మంచిర్యాల, అక్టోబరు 30: మంచిర్యాల మున్సిపాలిటీలో ఆటోల కొనుగోలులో జరిగిన అవినీతిని కప్పిపుచ్చుకొనేందుకే అధికార పార్టీ నాయకులు తమపై విమర్శలకు పాల్పడు తున్నారని కాంగ్రెస్‌ పార్టీ నాయకులు ఆరోపించారు. మాజీ ఎమ్మెల్సీ కొక్కిరాల ప్రేంసాగర్‌ రావు నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. అవినీతి జరుగలేదని నిరూపించుకోవాలని డిమాండ్‌ చేయడంతో సమాధానం చెప్పలేక తమ నాయకుడు ప్రేంసాగర్‌రావుపై అడ్డగోలు గా మాట్లాడుతున్నారని అన్నారు. ఆటోల కొనుగోలులో కూడా నిబంధనలు విస్మరించి, ఇష్టారీతిగా వ్యవహరించారని అన్నారు. సమా వేశంలో కాంగ్రెస్‌ పట్టణ అధ్యక్షుడు అంకం నరేష్‌, డిప్యూటీ ఫ్లోర్‌లీడర్‌ వేములపల్లి సంజీ వ్‌, కౌన్సిలర్లు సల్ల మహేష్‌, ప్రకాశ్‌ నాయ కులు, మోతె సుజాత, అబ్దుల్‌ సత్తార్‌,  నల్ల రవి, జోగుల సదానందం, కొండ చంద్రశేఖర్‌ పాల్గొన్నారు.