Abn logo
May 24 2020 @ 03:56AM

కరోనా యుద్ధంలో విమర్శలు దేశ ద్రోహమే: బీజేపీ

నెల్లూరు(స్టోన్‌హౌ్‌సపేట), మే 23 :  దేశంలో కరోనాతో యుద్ధం చేస్తున్న సమయంలో ప్రధానికి అండగా నిలవాల్సిన ప్రతిపక్షాలు విమర్శలు చేయడం దేశద్రోహమే అని బీజేపీ నాయకులు అన్నారు. నెల్లూరులోని బీజేపీ కార్యాలయంలో శనివారం నాయకులు సన్నపురెడ్డి సురే్‌షరెడ్డి, ఆంజనేయుల రెడ్డి, భరత్‌కుమార్‌ యాదవ్‌, సురేంద్రరెడ్డిలు విలేకర్లతో మాట్లాడుతూ  కరోనా ప్రారంభమైన తొలి రోజుల్లో భారత దేశంలో కోటికి పైగా కరోనా సోకి మరణిస్తారని డబ్ల్యూహెచ్‌వో సంస్థ అభిప్రాయ పడిందన్నారు. ప్రధాని మోదీ తీసుకున్న చర్యలతో  మూడు శాతం మరణాలు కూడా నమోదు కాకపోవడంతో ప్రపంచం  మన వైపు చూస్తోందన్నారు.


దేశం సంక్షోభం నుంచి అభివృద్ధి పథంలో పయనించేలా ప్రధాని  రూ.20 లక్షల కోట్ల ప్యాకేజీను ప్రకటించారన్నారు. అన్ని రంగాలను ప్రోత్సహించేలా ఉన్న  ఈ ప్యాకేజీను ప్రతి పక్షాలు విమర్శించడం సరికాదన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి ప్యాక్షనిస్టు పాలన సాగిస్తున్నారని సన్నపరెడ్డి సురేష్‌ రెడ్డి ఆరోపించారు. ఈ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి కోర్టులు ముట్టికాయలు వేస్తున్నా ధిక్కరిస్తూనే ఉందన్నారు. సమావేశంలో బీజేపీ నాయకులు మిడతల రమేష్‌, మెగరాల్ల సురేష్‌, జగన్మోహన్‌రావు, వెంకటేశ్వర్లు, రోసయ్య, కాయల మధు  పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement