Advertisement
Advertisement
Abn logo
Advertisement

క్రిస్పీ కార్న్‌

కావలసిన పదార్థాలు: స్వీట్‌ కార్న్‌- రెండు కప్పులు, ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు- అర కప్పు, కార్న్‌ ఫ్లోర్‌, వరి పిండి- చెరో పావు స్పూను, మైదా- స్పూను, మిరియాల పొడి- పావు స్పూను, కారం- అర స్పూను, కొత్తిమీర తరుగు - రెండు స్పూన్లు, ఉప్పు, నూనె, నీళ్లు- తగినంత.


తయారుచేసే విధానం: ముందుగా స్వీట్‌ కార్న్‌ని ఉడికించి పెట్టుకోవాలి. ఓ గిన్నెలో కార్న్‌ ఫ్లోర్‌, వరి పిండి, మైదా, ఉప్పు, ఉడికించిన స్వీట్‌ కార్న్‌ను వేసి తగినంత నీటితో ఓ మోస్తరుగా కలుపుకోవాలి. ఓ బాణలిలో నూనె మరిగించి బజ్జీల్లా వేయించాలి. వేయించిన కార్న్‌ను ఓ వెడల్పాటి గిన్నెలోకి తీసుకుని దాని పైన కారం, మిరియాల పొడి, కొంచెం ఉప్పు, ఉల్లి, క్యాప్సికమ్‌ ముక్కలు, కొత్తిమీర తరుగు వేసి పైకీ కిందకీ కలిపితే క్రిస్పీ కార్న్‌ రెడీ.

వెజ్ స్ప్రింగ్ రోల్స్సొరకాయ దోశమంగళూరు బోండాఆమ్లా మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కట్‌లెట్‌మెంతి పకోడీపెరుగు ఇడ్లీకొత్తిమీర వడలువేరుశనగల చాట్‌దోశకార్న్‌ చీజ్‌ బాల్స్‌
Advertisement