Abn logo
Sep 17 2021 @ 01:23AM

డిగ్రీ విద్యార్థిని ఆత్మహత్య

ధర్మవరం, సెప్టెంబరు 16: పట్టణంలోని సిద్దయ్యగుట్టలో డిగ్రీ విద్యార్థిని గట్టు అఖిల (20) గురువారం సాయంత్రం ఆత్మహత్య చేసుకుంది. పోలీసు లు తెలిపిన వివరాల మేరకు... సిద్దయ్యగుట్టలో ఉంటున్న ఆర్టీసీ ఉద్యోగి వెంకటేశ్‌, రమణమ్మ దంపతుల కుమార్తె అఖిల కదిరిలోని ఓ ప్రైవేటు కళాశాలలో డిగ్రీ ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఈ నేపథ్యంలో తల్లిదండ్రులు గురువారం పట్టణంలోని శాంతినగర్‌లో నూతన ఇంటి నిర్మాణ పను లు చూసుకునేందుకు వెళ్లారు. ఆ సమయంలో అఖిల ఇంట్లో ఫ్యాన్‌కు ఉరేసుకుని, ఆత్మహత్యకు ఒడిగట్టింది. సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులు పిలవగా.. ఎంత సేపటికీ తలుపులు తీయలేదు. దీంతో అనుమానం వచ్చి కిటికీలో నుంచి చూడగా కుమార్తె ఉరికి వేలాడుతుండటంతో బోరు న విలపించారు. చుట్టుపక్కల వారి సాయంతో తలుపులు బద్దలుకొట్టి, పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు అక్కడికి చేరుకుని, పరిశీలించారు. మృతదేహాన్ని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తన కుమార్తె ఎందుకు ఆత్మహత్య చేసుకుందో తెలియదని తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమయ్యారు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేపట్టారు.