Abn logo
Sep 17 2021 @ 01:22AM

రెండు బైక్‌లను ఢీకొట్టిన గుర్తుతెలియని వాహనం

 మహిళ మృతి... మరో ముగ్గురికి గాయాలు

నార్పల,సెప్టెంబరు 16: మండలంలోని నరసాపురం గ్రామ సమీపంలో గురువారం రాత్రి రెండు బైక్‌లను గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టడంతో ఉత్తమ్మ(40) అక్కడికక్కడే మృతి చెందింది. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మండలంలోని నిలువరాయి గ్రామానికి చెందిన కిష్ట య్య, అతడి భార్య ఉత్తమ్మ ఒక ద్విచక్రవాహనంలో, అదే గ్రామానికి చెందిన తల్లీకొడుకులు ఎర్రమ్మ, వినోద్‌ మరో ద్విచక్రవాహనంలో వెళ్లి రంగాపురం గ్రామంలో ఉల్లినారు మాట్లాడుకుని స్వగ్రామానికి బయల్దేరారు. మార్గమధ్యలో నరసాపురం గ్రామ సమీపంలో గుర్తుతెలియని వాహనం ఆ రెండు ద్విచక్రవాహనా లను ఢీకొం ది. దీంతో ఉత్తమ్మ అక్కడికక్కడే మృతి చెందింది. కిట్టయ్య, ఎర్రమ్మ, వినోద్‌ తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనం ద్వారా అనంతపురం ప్రభుత్వాస్పత్రికి తరలించా రు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు 108 సిబ్బంది తెలిపారు. మృతురాలికి ఇద్దరు పిల్లలున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ వెంకటప్రసాద్‌ తెలిపారు.