Abn logo
Sep 17 2021 @ 01:21AM

గుర్తుతెలియని శవం కలకలం

దేహాన్ని కాల్చిన దుండగులు.. 

పలు కోణాల్లో పోలీసుల దర్యాప్తు

అనంతపురం క్రైం, సెప్టెంబరు 16: నగర శివారులోని ఓ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. ఆనవాళ్లు గు ర్తించనంతగా దేహాన్ని కాల్చడం కలకలం రేపుతోంది. ఈ విష యం ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. అనంతపురం రూరల్‌ మండలం రాచానపల్లి పరిధిలోని ఎస్‌ఆర్‌ డిఫెన్స్‌ అకాడమీ సెంటర్‌ సమీపంలో ముళ్ల పొదల వద్ద ఈనెల 15న అర్ధరాత్రి సమయంలో మంటలు చెలరేగాయి. ఆ సమయంలో ఆ మంటలను గమనించిన ట్రైనింగ్‌ సెంటర్‌ యు వకులు సాధారణమైనవిగా భావించి, వదిలేశారు. గురువారం మధ్యాహ్నం అటుగా వెళ్లిన స్థానికులు తల నుంచి మోకాళ్ల వరకు పూర్తిగా కాలిపోయిన సుమారు 25 ఏళ్ల వయసు కలిగిన వ్యక్తి మృతదేహాన్ని గమనించారు. విషయం డిఫెన్స్‌ అకాడమీ యువతకు తెలపడంతో వారు పోలీసులకు చేరవేశారు. రూరల్‌ సీఐ మురళీధర్‌రెడ్డి.. ఎస్‌ఐ నబిరసూల్‌, సిబ్బందితోపాటు క్లూస్‌ టీం, గాడ్‌ స్క్వాడ్‌తో క్షుణ్ణంగా పరిశీలించారు. మృతదేహం సమీపంలో ఎలాంటి క్లూ దొరకలేదు. సదరు గ్రామ రెవెన్యూ అధికారి రమేష్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని, దర్యాప్తు చేస్తున్నారు. దీనిపై పలు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఎక్కడైనా హత్య చేసి, ఇక్కడికి తెచ్చి కాల్చారా? అన్న కోణంలో దర్యాప్తు ముమ్మరం చేసినట్లు పోలీసు వర్గాల ద్వారా తెలిసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు.