Abn logo
Oct 24 2020 @ 18:09PM

బెజవాడలో క్రికెట్ బెట్టింగ్ ముఠా అరెస్ట్

Kaakateeya

విజయవాడ: నగరంలో క్రికెట్ బెట్టింగ్ ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. విజయవాడ, గుంటూరు జిల్లాలకు చెందిన 9 మంది యువకులను అదుపులోకి తీసుకున్నారు. ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌లపై ఆన్‌లైన్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నారు.పెనమలూరు పీఎస్ మురళినగర్‌లో అద్దెకు ఇల్లు తీసుకుని   క్రికెట్ మజా యాప్ ద్వారా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు గుర్తించారు. వారి నుంచి రూ.7.50 లక్షల, 20 మొబైల్ కనెక్షన్ కలిగిన కమ్యూనికేటర్ బాక్స్, ల్యాప్‌టాప్, 13 సెల్‌ఫోన్స్ స్వాధీనం చేసుకున్నారు. 

Advertisement
Advertisement