Abn logo
Sep 25 2020 @ 22:03PM

ఆళ్లగడ్డలో క్రికెట్ బుకీలు అరెస్ట్..

Kaakateeya

కర్నూలు : ఐపీఎల్- 2020 ప్రారంభం కావడంతో దాన్ని చూసి క్రీడాభిమానులు ఆనందిస్తుండగా.. మరోవైపు బెట్టింగ్ రాయుళ్లు మాత్రం రెచ్చిపోతున్నారు. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో బెట్టింగ్‌కు పాల్పడుతున్న పలువుర్ని పోలీసులు అరెస్ట్ చేసి.. భారీగా నగదు, మొబైల్స్‌ను స్వాధీనం చేసుకున్నారు. 


తాజాగా.. కర్నూలు జిల్లా ఆళ్లగడ్డ మండలం చింతకుంటలో బెట్టింగ్‌కు పాల్పడుతున్న పది మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరిలో ప్రధాను బుకీ నంద్యాలకు చెందిన గిరిని మొదట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రూ. 2,35,000 నగదు, 8 సెల్ ఫోన్‌లు, ఎలక్ట్రానిక్ పరికరాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.


కాగా.. ఐపీఎల్ ఆరంభ మ్యాచ్ నుంచే బెట్టింగ్ ప్రారంభించేసారు. కేవలం మ్యాచ్ విజేతలు ఎవరు అనేది మాత్రమే కాకుండా టాస్ ఎవరు గెలుస్తారు..? ఏ బాట్స్‌మెన్ ఎన్ని పరుగులు చేస్తాడు..? ఎవరు ఔట్ అవుతారు..? ఎవరు మ్యాచ్‌ను గెలిపిస్తారు..? అని పెద్ద ఎత్తున బెట్టింగ్‌లు పెడుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement