Abn logo
Sep 22 2020 @ 06:04AM

కలెక్టరేట్‌ వద్ద సీపీఎం ధర్నా

ఏలూరు కలెక్టరేట్‌, సెప్టెంబరు 21: పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం అను సరిస్తున్న ప్రజా వ్యతిరేక బిల్లులను  నిరసిస్తూ, కరోనా నేపథ్యంలో ఆదాయపు పన్ను పరిధిలో లేని కుంటుబాలకు నెలకు కనీసం రూ.7500లు ఆరు నెలల పాటు ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ సీపీఎం నగర కమిటీ ఆధ్వర్యంలో సోమ వారం కలెక్టరేట్‌ వద్ద ధర్నా నిర్వహించారు. నగర కార్యదర్శి పి.కిషోర్‌ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి చింతకాయల బాబూరావు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం పార్లమెంటు సాక్షిగా ప్రజా వ్యతిరేక బిల్లులు మందిబలంతో ఆమో దం చేసుకుంటుందని విమర్శించారు. కరోనా వల్ల ఉపాధి పోయిన ప్రజలను ఆర్థికంగా ఆదుకోవడంలో విఫలమైందని మండిపడ్డారు. జిల్లా నాయకులు శ్యా మలారాణి, బి.శివకుమార్‌, ఎం.శ్రీనివాస్‌, బి.సాయిబాబు, శ్రీనివాస్‌, డి.జగ న్నాథం తదితరులు పాల్గొన్నారు.  

Advertisement
Advertisement
Advertisement