Abn logo
Aug 7 2020 @ 03:37AM

బీజేపీ ద్వంద్వ వైఖరి బట్టబయలు: రామకృష్ణ

అమరావతి, ఆగస్టు 6(ఆంధ్రజ్యోతి): ‘‘హైకోర్టులో సమర్పించిన అఫిడవిట్‌తో అమరావతి రాజధాని విషయంలో బీజేపీ ద్వంద్వ వైఖరి బట్టబయలైంది. పరోక్షంగా జగన్‌ వైఖరిని బీజేపీ బలపరుస్తోంద’’ని సీపీఐ రాష్ట్ర కా ర్యదర్శి రామకృష్ణ విమర్శించారు. ఒకవైపు అమరావతి రాజధానిగా కొనసాగాలంటూ బీజేపీ రాష్ట్రశాఖ నాయకులు ఉద్యమంలో పాల్గొంటూనే, మరో వైపు రాజధాని అంశం కేంద్రానికి సంబంధంలేదనడం దుర్మార్గమన్నారు. 


రాష్ట్రంలో వైద్యంపై నమ్మకంలేకే...

ఏపీలో వైద్యంపై నమ్మకంలేకే సాక్షాత్తు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు పొరుగు రాష్ట్రానికి వెళ్లి చికిత్స చేయించుకుంటున్నారని రామకృష్ణ విమర్శించారు. మొత్తం మీద కరోనా కట్టడిలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. 

Advertisement
Advertisement
Advertisement