Advertisement
Advertisement
Abn logo
Advertisement

ప్రధాని మోదీకి సీపీఐ రామకృష్ణ లేఖ

అమరావతి : ప్రధాని నరేంద్ర మోదీకి సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ లేఖ రాశారు. ఏపీలోని వరద విపత్తును జాతీయ విపత్తుగా గుర్తించి, ఆదుకోవాలని ఆయన లేఖలో కోరారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల వల్ల 5 జిల్లాల్లో దాదాపు 2 లక్షలకు పైగా హెక్టార్లలో పంట నష్టం జరిగిందన్నారు. రెండు డ్యాంలు, చెరువులు, కాల్వలకు గండి పడి తీవ్ర నష్టం వాటిల్లిందని రామకృష్ణ తెలిపారు. 60 మంది మృతి చెందగా, పలువురు ఇళ్లు కోల్పోయి నిరాశ్రయులయ్యారన్నారు. ఏపీలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో కేంద్ర బృందం పర్యటించి సహాయ కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. మీరు గానీ, కేంద్ర మంత్రులుగాని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి ప్రజల బాధలు తెలుసుకోవాలన్నారు. తక్షణమే ఏపీకి కేంద్రం నుంచి వరద సహాయక నిధులు విడుదల చేయాలని రామకృష్ణ కోరారు.

Advertisement
Advertisement