Abn logo
Mar 6 2021 @ 14:05PM

ఆ విషయం బుగ్గన చెప్పడం సిగ్గుచేటు: రామకృష్ణ

విజయవాడ: రాష్ట్రం అప్పులు పాలైందని ఆర్థిక మంత్రి బుగ్గున రాజేంద్రనాధ్‌రెడ్డి చెప్పడం సిగ్గుచేటని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మండిపడ్డారు. శనివారం మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు 60 నెలల కాలంలో 1,30,000 వేల కోట్లు అప్పు చేస్తే.. 20 నెలల కాలంలోనే జగన్ 1,55,000 కోట్లు అప్పు చేయటం‌ అంటే రాష్ట్రం ఎటు పోతుందని ప్రశ్నించారు. తెచ్చిన అప్పులతో ఎంత అభివృద్ధి చేశారో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం చేసిన అప్పులు, జరిగిన అభివృద్ధిపై శ్వేత పత్రం విడుదల చేయాలన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు అందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. రాష్ట్ర బీజేపీ నేతలు సిగ్గు తెచ్చుకొని కేంద్రంపై ఒత్తిడి తీసుకురావాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ప్రజలను ఓటు అడిగే హక్కు బీజేపీకి లేదని రామకృష్ణ అన్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నల్ల చట్టాలను వెంటనే రద్దు చేయాలని  డిమాండ్ చేశారు. నల్ల చట్టాలపై రైతులు ఉద్యమం 100 రోజులకు చేరిందని...250మందికి పైగా రైతులు చనిపోయారని...అయినా కేంద్ర ప్రభుత్వం నుండి స్పందన లేదని విమర్శించారు. రైతులకు ఏపీ సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందని రామకృష్ణ తెలిపారు. 

Advertisement
Advertisement
Advertisement