Abn logo
Jul 1 2021 @ 18:07PM

వారంతా ఈరోజు కేసీఆర్ క్యాబినెట్‌లో..: నారాయణ

ఖమ్మం: తెలంగాణను వ్యతిరేకించిన వారంతా ఈరోజు కేసీఆర్ క్యాబినెట్‌లో ఉన్నారని సీపీఐ నేత నారాయణ అన్నారు.  గురువారం ఆయన మధిరలో పర్యటించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కాంగ్రెస్ టీపీసీసీని ప్రకటించడంలో ఆలస్యం చేసింది లేకపోతే ఈటల రాజేందర్ బీజేపీలో చేరేవారు కాదన్నారు. రానున్న రోజుల్లో బీజేపీ ప్రభావం తగ్గిపోతుందని చెప్పారు. దేశంలో ప్రాంతీయ పార్టీల ప్రభావం పెరుగుతుందని జోస్యం చెప్పారు. 


అశోక్ గజపతిరాజు నీతిమంతుడు

మాన్సాస్ ట్రస్ట్ చైర్మన్, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతిరాజు గురించి సీపీఐ నేత నారాయణ కీలక వ్యాఖ్యలు చేశారు. అశోక్ గజపతిరాజు కుటుంబం ఆస్తులను త్యాగం చేసి ప్రజా సేవ చేసిందన్నారు. రాజకీయ పార్టీలు వేరైనా అశోక్ గజపతిరాజు నీతిమంతుడు రాజకీయంగా విమర్శించాలి తప్ప వ్యక్తిగతంగా విమర్శించకూడదని నారాయణ అన్నారు. 

క్రైమ్ మరిన్ని...