Advertisement
Advertisement
Abn logo
Advertisement

సినీనటి ఛౌరాసియాపై దాడి ఘటనను చేధించిన పోలీసులు

హైదరాబాద్: కేబీఆర్ పార్క్ వద్ద సినీ నటి ఛౌరాసియాపై దాడి, మొబైల్ పోన్ చోరీ కేసును పోలీసులు చేధించారు. నిందితుడు మహబూబ్ నగర్ జిల్లా, కుల్కచర్లకు చెందిన కొమ్ముబాబుగా గుర్తించారు. ఈ సందర్భంగా సీపీ అంజనీకుమార్ మీడియా సమావేశంలో మాట్లాడుతూ మూడేళ్ల క్రితం హైదరాబాదుకు వచ్చినా బాబు.. సినిమా షూటింగ్‌లలో సెట్ వర్కర్‌గా పని చేసేవాడన్నారు. ప్రస్తుతం ఇందిరా నగర్‌లో నివాసం ఉంటున్నాడని, సెట్ వర్కర్‌గా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో  చోరీలకు పాల్పడుతున్నాడన్నారు. కేబీఆర్ పార్క్ ఔటర్ ట్రాక్ అడ్డాగా దోపిడీలకు పాల్పడేవాడన్నారు. ఈ క్రమంలో వారం రోజుల క్రితం నటి చౌరాసియాపై దాడి చేసి మొబైల్ అపహరించుకుని పారిపోయాడన్నారు. బంజారాహిల్స్ పోలీసులు, టాస్క్‌ఫోర్స్ పోలీసులు ఈ కేసును చేధించడానికి సంయుక్తంగా పని చేశారని అంజనీకుమార్ తెలిపారు. ఘటన స్థలంలో సీసీ కెమెరాలు లేకపోవడంతో నిందితుడిని పట్టుకోవడం అలస్యం అయిందన్నారు. 

Advertisement
Advertisement