Abn logo
Oct 15 2021 @ 01:15AM

111 మందికి కరోనా

గుంటూరు, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో కొత్తగా 111 మందికి కరోనా వైరస్‌ సోకింది. గురువారం ఉదయం వరకు 3,165 శాంపిల్స్‌ టెస్టింగ్‌ జరగగా 3.51 శాతం మందికి పాజిటివ్‌ వచ్చింది. హోం ఐసోలేషన్‌లో ఉన్న వారిలో కేవలం తొమ్మిది మంది మాత్రమే కోలుకోవడంతో క్రియాశీలక పాజిటివ్‌ కేసుల సంఖ్య 713కి పెరిగింది. కొత్తగా గుంటూరు నగరంలో 47, రేపల్లెలో 8, పొన్నూరులో 7, తాడేపల్లిలో 7, తెనాలిలో 6, నరసరావుపేటలో 5, అమరావతిలో 3, మాచర్లలో 3, చిలకలూరిపేటలో 3, పెదకాకానిలో 2, సత్తెనపల్లిలో 2, తాడికొండలో 2, రొంపిచర్లలో 2, బాపట్లలో 2, చేబ్రోలులో 1, కాకుమానులో 1,  కొల్లిపరలో 1, నగరంలో 1, నిజాంపట్నంలో 1, చుండూరులో 1, నాదెండ్లలో 1, నూజెండ్లలో 1, మంగళగిరిలో 1, దాచేపల్లిలో 1, శావల్యాపురంలో 1, వినుకొండలో 1 పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్‌ జొన్నలగడ్డ యాస్మిన్‌ తెలిపారు. కాగా 24,346 మందికి కోవిడ్‌ వ్యాక్సిన్‌ తొలిడోసు, 19,554 మందికి రెండో డోసు వేసినట్లు చెప్పారు.  

నెలాఖరు వరకు కర్ఫ్యూ పొడిగింపు ఉత్తర్వులు

కరోనా వ్యాప్తిని అరికట్టే ప్రక్రియలో భాగంగా రాత్రి కర్ఫ్యూని ఈ నెలాఖరు వరకు పొడిగిస్తూ కలెక్టర్‌ వివేక్‌యాదవ్‌ ప్రొసీడింగ్స్‌ జారీ చేశారు. నిత్యం అర్ధరాత్రి 12 గంటల నుంచి వేకువజామున 5 గంటల వరకు కర్ఫ్యూ అమలులో ఉంటుందని ఆయన పేర్కొన్నారు. సభలు, సమూహాలు, సమావేశాలు, వివాహాలు, మతపరమైన కార్యక్రమాలకు 250కి మించి అనుమతించబోమన్నారు.