Advertisement
Advertisement
Abn logo
Advertisement

ఫ్రైడే..

కొవిడ్‌ కొత్త వేరియంట్‌ కలకలం..

సెన్సెక్స్‌ 1,688 పాయింట్లు ఫట్‌      

కుప్పకూలిన స్టాక్‌ మార్కెట్లు 

నిఫ్టీ 17,100 దిగువకు పతనం  

రూ.7.35 లక్షల కోట్ల సంపద ఆవిరి 


ముంబై: కరోనా వైర్‌సలో డెల్టా కంటే ప్రమాదకరమైన వేరియంట్‌ పుట్టుకురావడం ప్రపంచ స్టాక్‌ మార్కెట్లను హడలెత్తించింది. దలాల్‌ స్ట్రీట్‌ వర్గాలూ దడుసుకోవడంతో భారత ప్రామాణిక ఈక్విటీ సూచీలు కుప్పకూలాయి. దీంతో శుక్ర వారం ట్రేడింగ్‌ ముగిసేసరికి బీఎ్‌సఈ సెన్సెక్స్‌ ఏకంగా 1,687.94 పాయింట్లు పతనమై 57,107.15 వద్దకు జారుకుంది. ఎన్‌ఎస్‌ఈ నిఫ్టీ 509.80 పాయింట్లు క్షీణించి 17,026.45 వద్ద క్లోజైంది. కరోనా సంక్షోభ ప్రభావిత రంగాల షేర్ల నుంచి పెట్టుబడులు వెనక్కి తీసుకునేందుకు మదుపర్లు ఎగబడటంతో మార్కెట్‌ భారీగా పతనమైందని మార్కెట్‌ విశ్లేషకులు అన్నారు. బ్లూచి్‌పలతో పాటు చిన్న, మధ్య స్థాయి కంపెనీ షేర్లలోనూ ట్రేడర్లు అమ్మకాలు పోటెత్తించారు. దాంతో బీఎ్‌సఈ మిడ్‌క్యాప్‌ ఇండెక్స్‌ 3.23 శాతం, స్మాల్‌క్యాప్‌ సూచీ 2.61 శాతం నష్టపోవాల్సి వచ్చింది.


హెల్త్‌కేర్‌ మినహా మిగతా రంగ సూచీలన్నీ భారీగా నష్టపోయాయి. రియల్టీ  సూచీ ఏకంగా 6.42 శాతం క్షీణించగా.. మెటల్‌ ఇండెక్స్‌ 5.36 శాతం తగ్గింది. ఆటో, బేసిక్‌ మెటీరియల్స్‌ సూచీలు 4 శాతానికి పైగా పతనం కాగా.. మిగతా రంగ సూచీలు 2-3 శాతానికి పైగా జారుకున్నాయి. దాంతో, ఒక్కరోజులోనే రూ.7.35 లక్షల కోట్ల మార్కెట్‌ సంపద ఆవిరైపోయింది. దీంతో బీ ఎస్‌ఈ లిస్టెడ్‌ కంపెనీల మొత్తం మార్కెట్‌ సంపద రూ.258.31 లక్షల కోట్లకు పడిపోయింది. 


30లో 26 నష్టాల్లోనే.. 

సెన్సెక్స్‌లోని 30 లిస్టెడ్‌ కంపెనీల్లో 4 మినహా మిగతా అన్నీ నష్టాలు చవిచూశాయి. ఇండ్‌సఇండ్‌ బ్యాంక్‌ అత్యధికంగా 6.01 శాతం క్షీణించింది. టాటాస్టీల్‌, మారుతి సుజుకీ 5 శాతానికి పైగా నష్టపోగా.. ఎన్‌టీపీసీ, బజాజ్‌ ఫైనాన్స్‌, హెచ్‌డీఎ్‌ఫసీ, టైటాన్‌, మహీంద్రా అండ్‌ మహీంద్రా, ఎస్‌బీఐ షేర్లు 4 శాతానికి పైగా మార్కెట్‌ విలువను కోల్పోయాయి. డాక్టర్‌ రెడ్డీస్‌ మాత్రం 3.32 శాతం లాభంతో టాప్‌ గెయినర్‌గా నిలిచింది. నెస్లే, ఏషియన్‌ పెయింట్స్‌ అతి స్వల్పంగా లాభపడ్డాయి. 


ఈవారంలో సెన్సెక్స్‌ 4.24 శాతం డౌన్‌ 

గడిచిన ఐదు ట్రేడింగ్‌ సెషన్లలో సెన్సెక్స్‌ మొత్తం 2,528.86 పాయింట్లు (4.24 శాతం) కోల్పోగా.. నిఫ్టీ 738.35 పాయింట్లు (4.15 శాతం) పతనమైంది. 


బంగారం.. ప్రియం

దేశంలో బంగారం, వెండి ధరలు పెరిగాయి. ఢిల్లీ స్పాట్‌ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర శుక్రవారం నాడు రూ.570 పెరిగి రూ.47,155కు చేరుకుంది. కిలో వెండి రూ.190 మేర ప్రియమై రూ.62,145 ధర పలికింది. అంతర్జాతీయ మార్కెట్లో విలువైన లోహాలకు డిమాండ్‌ పెరగడం ఇందుకు కారణమైంది. కరోనా కొత్త వేరియంట్‌ ప్రపంచ మార్కెట్‌ భవిష్యత్‌పై అనిశ్చితి పెంచింది. ఈ ప్రతికూల పరిస్థితుల్లో భద్రమైన పెట్టుబడి సాధనంగా పేరున్న బంగారంలో పెట్టుబడులకు ఇన్వెస్టర్లు మొగ్గుచూపారు. 


నెల కనిష్ఠానికి రూపాయి 

దేశీయ కరెన్సీ విలువ దాదాపు నెల రోజుల కనిష్ఠ స్థాయికి పడిపోయింది. ఫారెక్స్‌ మార్కెట్లో డాలర్‌తో రూపాయి మారకం రేటు 37 పైసల మేర బలహీనపడి రూ.74.89కి చేరుకుంది. గత నెల 28 తర్వాత డాలర్‌-రుపీ మారకం రేటుకిదే కనిష్ఠ ముగింపు స్థాయి. ఈక్విటీ మార్కెట్లో అమ్మకాలు హోరెత్తడంతో పాటు కరోనా కొత్త వేరియంట్‌ భయాలు కరెన్సీని మరింత బలహీనపర్చాయి. 


73 డాలర్లకు తగ్గిన క్రూడ్‌ 

కరోనా కొత్త వేరియంట్‌తో చాలా దేశాలు మళ్లీ లాక్‌డౌన్‌ విధించాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చన్న భయాలతో అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధరలు అనూహ్యంగా తగ్గా యి. బ్రెంట్‌ రకం క్రూడాయిల్‌ ధర ఒకదశలో  10 శాతానికి పైగా తగ్గి 73.62 డాలర్ల వద్ద ట్రేడైంది. నైమెక్స్‌ క్రూడ్‌ రేటు సైతం12 శాతానికి పైగా పతనమై 69 డాలర్ల స్థాయికి జారుకుంది. 


Advertisement
Advertisement