Abn logo
Sep 22 2020 @ 00:00AM

కొవిడ్‌ నిబంధనలతో కళాశాలకు రావచ్చు

జడ్చర్ల, సెప్టెంబరు 22: ఇంటర్‌ విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం దూరదర్శన్‌లో ఆన్‌లైన్‌ తరగతులను నిర్వహిస్తుందని, సందేహల నివృత్తి కోసం కొవిడ్‌ నిబంధనలతో విద్యార్థులు కళాశాలకు రావచ్చని డీఐఈఓ వెంకటేశ్వర్లు సూచించారు. జడ్చర్ల ప్రభుత్వ కోఎడ్యుకేషన్‌ జూనియర్‌ కళాశాలను సోమవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కళాశాల అధ్యాపకులతో నిర్వహించిన సమావేశంలో మాట్లాడారు. కళాశాలకు వచ్చేందుకు తల్లిదండ్రుల నుంచి అనుమతి పత్రాన్ని విద్యార్థులు విధిగా తేవాలని చెప్పారు. కార్యక్రమంలో కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌ మోజెస్‌, అధ్యాపకులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement
Advertisement