Abn logo
Sep 18 2021 @ 00:58AM

పకడ్బందీగా ఓట్ల లెక్కింపు

కొవిడ్‌ టెస్టు తప్పనిసరి

కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌

ఒంగోలు(కలెక్టరేట్‌), సెప్టెంబరు 17 : జిల్లాలో పరిషత్‌ ఓట్ల లెక్కింపు ఈనెల 19న నిర్వహించేందుకు పకడ్బందీ ఏర్పాట్లు చేస్తున్నట్లు కలెక్టర్‌ ప్రవీణ్‌కుమార్‌ వెల్లడించారు. ప్రకాశం భవన్‌లోని వీడియో కాన్ఫరెన్స్‌ హాలులో శుక్రవారం ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 41 జడ్పీటీసీలు, 367 ఎంపీటీసీ స్థానాలకు కౌంటింగ్‌ జరుగుతుందన్నారు. అందుకోసం జిల్లాలో ఎనిమిది ప్రాంతాల్లో ఏర్పాట్లు చేశామన్నారు. జిల్లాలో 8.99 లక్షల మంది ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకున్నారని తెలిపారు. ఆదివారం ఉదయం 8గంటలకు  లెక్కింపు ప్రారంభమవుతుందని తెలిపారు. కౌంటింగ్‌ కేంద్రాల వద్ద కొవిడ్‌ నిబంధనలు తప్పనిసరిగా పాటించడంతో పాటు ఏజెంట్లు, అభ్యర్థులు  కరోనా టెస్టు చేయించుకుంటేనే లోపలికి అనుమతి ఇస్తామమని తెలిపారు. ఎస్పీ మలికగర్గ్‌ మాట్లాడుతూ కౌంటింగ్‌ కేంద్రాల వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. సమావేశంలో జేసీ టీఎస్‌ చేతన్‌, జడ్పీ సీఈవో దేవానంద్‌రెడ్డి ఉన్నారు. కాగా అంతకుముందు ఎస్పీతో కలిసి కలెక్టర్‌ కౌటింగ్‌పై మండలస్థాయి అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు.