Abn logo
Sep 18 2021 @ 00:32AM

రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

జేఎన్‌టీయూలో కౌంటింగ్‌ ఏర్పాట్లను పరిశీలిస్తున్న కలెక్టర్‌, ఎస్పీ

కౌంటింగ్‌కు ముమ్మర ఏర్పాట్లు!

రేపు ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపు

11 ప్రాంతాల్లో 63 సా్ట్రంగ్‌ రూములు

ఏర్పాట్లలో తలమునకలైన జిల్లా యంత్రాంగం

అనంతపురం విద్య, సెప్టెంబరు 17:  ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. కోర్టు నుంచి కౌంటింగ్‌కు గ్రీన్‌సిగ్నల్‌ రావడంతో... ఈనెల 19వ తేదీ కౌంటింగ్‌ నిర్వహించేలా రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నోటిఫికేషన్‌ ఇచ్చారు. కలెక్టర్‌ నాగలక్ష్మి  కౌంటింగ్‌ ఏర్పాట్లపై అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.  శుక్రవారం జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, డిప్యూటీ సీఈఓ శ్రీనివాసులుతోపాటు, 14 నియోజక వర్గాల్లో ఆర్డీఓలు, ఎంపీడీఓలు కౌంటింగ్‌ ఏర్పాట్లలో తలమునకలయ్యారు. జిల్లా వ్యాప్తంగా 11 ప్రాంతాల్లో 17 బ్యాలెట్‌ రిసెప్షన్‌ సెంటర్లు ఉండగా ఆయా ప్రాంగణాల్లోనే మండలానికి ఒకటి చెప్పున 63 సా్ట్రంగ్‌ రూములు ఏర్పాటు చేశారు. వాటి పరిధిలో కౌంటింగ్‌కు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు.  బారికేడ్ల ఏర్పాట్లు, సీసీ కెమెరాలు, ఇతర సదుపాయాల ఏర్పాటుతో అధికారులు బిజీబిజీగా ఉన్నారు. 


96 కౌంటింగ్‌ హాళ్లు...

జిల్లాలో 63 జడ్పీటీసీ స్థానాలుండగా ఒక అభ్యర్థి మరణించడంతో 62 స్థానాలకు, ఎంపీటీసీ స్థానాలు 841 ఉండగా, 50 స్థానాలు ఏకగ్రీవం కాగా, మరో 10 మంది అభ్యర్థులు చనిపోవడంతో పోలింగ్‌ వాయిదా పడింది. దీంతో 781 ఎంపీటీసీ స్థానాలకు పోలింగ్‌ నిర్వహించారు. 249 మంది జడ్పీటీసీ అభ్యర్థులు, 2029 మంది ఎంపీటీసీ అభ్యర్థులు బరిలో నిలిచారు.  ఏప్రిల్‌ 8న పోలింగ్‌ నిర్వహించగా పరిషత ఎన్నికల్లో జడ్పీటీసీకి సంబంధించి 13,03,522 ఓట్లు పోల్‌ అవ్వగా 56.37 శాతం నమోదైంది. ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి 12,23,073 ఓట్లు పోల్‌ కాగా 55.99 శాతం నమోదైంది. జిల్లాలో కదిరి, కళ్యాణదుర్గం, అనంతపురం, పెనుకొండ, ధర్మవరం డివిజన్లలో 11 ప్రాంతాల్లో 96 కౌంటింగ్‌ హాళ్లు ఏర్పాటు చేశారు. 63 మంది రిటర్నింగ్‌ ఆఫీసర్లు, 126 మంది అసిస్టెంట్‌ రిటర్నింగ్‌ ఆఫీసర్లును నియమించారు.  ఒక్కో ఎంపీటీసీ స్థానానికి ఒక టేబుల్‌ ఏర్పాటు చేయనున్నారు. టేబుల్‌కు ఒక సూపర్‌వైజర్‌, ముగ్గురు సహాయకులను నియమించారు. నియోజకవర్గాల్లో కౌంటింగ్‌ స్టాఫ్‌కు శుక్రవారం శిక్షణ కూడా పూర్తిచేశారు. 


సా్ట్రంగ్‌రూమ్స్‌, ఏర్పాట్ల పరిశీలన

ఆదివారం కౌంటింగ్‌ నేపథ్యంలో కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప, జాయింట్‌ కలెక్టర్‌, జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి, ఇతర అధికారులు సా్ట్రంగ్‌ రూమ్స్‌ను, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. కలెక్టర్‌, ఎస్పీ జేఎన్టీయూ, కేఎ్‌సఎన్‌లోని సా్ట్రంగ్‌ రూమ్స్‌, ఇతర ఏర్పాట్లను పరిశీలించారు. అధికారులకు పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. జేసీ నిషాంత కుమార్‌ ఉరవకొండలోనూ, జేసీ సిరి ధర్మవరంలోనూ ఏ ర్పాట్లను పరిశీలించారు. ఆదివారం ఉద యం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభం కానుంది. 


కౌంటింగ్‌ పరిశీలకుడిగా హర్షవర్ధన్‌

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ పరిశీలకుడిగా ఐఏఎస్‌ అధికారి హర్షవర్ధన్‌ను నియమించారు. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్‌ నీలం సాహ్ని శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. సాంఘిక సంక్షేమ శాఖ సంచాలకుడిగా పనిచేస్తున్న ఆయనను ఏప్రిల్‌లో జిల్లా ఎన్నికల పరిశీలకుడిగా నియమించారు. తాజాగా కౌంటింగ్‌ పరిశీలకుడి బాధ్యతలు అప్పగించారు. దీంతో ఆయన శనివారం రా త్రి జిల్లాకు రానున్నారు. 


5 డివిజన్లకు 14 మంది నోడల్‌ అధికారుల నియామకం

జిల్లాలో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్‌ బాధ్యతలను జాయింట్‌ కలెక్టర్లు, జిల్లాస్థాయి అధికారులకు అప్పగించారు. ఈ మేరకు కలెక్టర్‌ నాగలక్ష్మి ఉత్తర్వులు జారీ చే శారు. 14 నియోజకవర్గాలకు 14 మంది నోడల్‌ ఆఫీసర్లను నియమించారు.  జాయింట్‌ కలెక్టర్లు, సబ్‌ కలెక్టర్లు, స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్లు, ఆర్డీఓలు, డిప్యూటీ డైరెక్టర్‌ స్థాయి అధికారులకు బాధ్యతలు అప్పగించారు.


కౌంటింగ్‌కు పటిష్ట భద్రత : ఎస్పీ

 అనంతపురం క్రైం: జిల్లా వ్యాప్తంగా ఈ నెల 19న జరిగే జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ పక్రియలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పటిష్ట భద్రత ఏర్పాటు చేయాలని ఎస్పీ డాక్టర్‌ ఫక్కీరప్ప  శుక్రవారం ఓ ప్రకటన ద్వారా ఆదేశించారు. రాష్ట్ర ఎన్నికల కమిషన ఆదేశాలు మేరకు ఎన్నికల కౌంటింగ్‌ పక్రియ ప్ర శాంతంగా జరిగే విధంగా పకడ్బందీ చర్యలు తీసుకోవా లని తెలిపారు. సా్ట్రంగ్‌ రూంల వద్ద నిత్యం నిఘా ఉంచా లన్నారు. సా్ట్రంగ్‌ రూం, కౌంటింగ్‌ కేంద్రాలు, పరిసర ప్రాం తాల్లో నిత్యం సీసీ కెమెరాలతో సిబ్బంది నిఘా ఉండాలని సూచించారు. అభ్యర్థులు నిబంధనలు అతిక్రమించకుండా చూడాలని సిబ్బందికి సూచించారు. కొవిడ్‌ నిబంధనలు పాటించడంతో పాటు కౌంటింగ్‌  జరిగే పరిసర ప్రాంతాల్లో స్థానికేతరులు లేకుండా చూడాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమస్యాత్మక ప్రాంతాలలో ప్రత్యేక నిఘా ఉం చాలన్నారు. కౌంటింగ్‌ జరిగే ప్రాంతాల్లో ట్రాఫిక్‌ అంత రాయం లేకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు.   రౌడీషీటర్లు, ట్ర బుల్‌ మాంగర్స్‌ కదలికలపై నిఘా పెంచా లన్నారు. ఎప్పటికప్పుడు క్షేత్రస్ధాయి పరిస్థితులను కమాండ్‌ కంట్రోల్‌కు తెలియజేయాలన్నారు. కౌం టింగ్‌ జరిగే ప్రా ంతాలు, పట్టణాల్లో ఓటరు కానివారికి లా డ్జీలు, హో ట ళ్లు, ఫంక్షన హాళ్లలో ఎలాంటి వసతి కల్పించరాదని హెచ్చరించారు. 


పరిషత ఎన్నికల లెక్కింపునకు పకడ్బందీగా ఏర్పాట్లు చేయండి.. కలెక్టర్‌ నాగలక్ష్మి 

అనంతపురం,సెప్టెంబరు 17(ఆంధ్రజ్యోతి) : ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌కు పకడ్బందీగా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం ఆమె కలెక్టరేట్‌ లోని వీసీ హాల్‌ నుంచి జేసీలు నిశాంతకుమార్‌, డా. సిరి, గంగాధర్‌ గౌడ్‌లతో కలిసి ఎన్నికల కౌంటింగ్‌పై ఆర్డీఓలు, స్పెషల్‌ ఆఫీసర్లు, డీఎస్పీలు, తహసీల్దార్‌లు, ఎంపీడీఓల తో వీడియో కాన్ఫరెన్స నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కౌంటింగ్‌ కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. 19వ తేదీ ఉదయం 8 గంటలకు కౌంటింగ్‌ ప్రారంభించాలన్నారు. జిల్లాలోని 5 డివిజన్ల పరిధిలో 17 కౌంటింగ్‌ కేంద్రాల్లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌ చేపడుతున్నామన్నారు.  అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో బారికేడ్లు ఏర్పాట్లు చేయాలన్నారు. కేంద్రాల్లో వెలుతురు సక్రమంగా ఉండేలా చూడా లన్నారు. జనరేటర్‌ను తప్పనిసరిగా అందుబాటులో ఉంచాలని తెలిపారు. అన్ని కౌంటింగ్‌ కేంద్రాల్లో స్టేషనరీ, బాల్‌పాయింట్‌ పెన్నులు, పేపర్లు, రబ్బర్‌ బ్యాండ్స్‌, సీలింగ్‌ సామగ్రిని అందుబాటులో ఉంచాలన్నారు. కౌంటింగ్‌ కేంద్రాల్లోకి మొబైల్‌ ఫోనల అనుమతి లేదన్నారు. కేంద్రాల్లోకి వెళ్లే సిబ్బంది, ఏజెంట్ల ఐడీ కార్డులను చెక్‌ చేయాలన్నారు. సీసీ టీవీలు ఏర్పాటు చేసి కౌంటింగ్‌ను వీడియో తీయించాలన్నారు. కార్యక్రమంలో జడ్పీ సీఈఓ భాస్కర్‌రెడ్డి,  డీపీఓ పార్వతి, రిటైర్డ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, ఎలక్షన డీటీ భాస్కర్‌ తదితరులు పాల్గొన్నారు. 


కౌంటింగ్‌ ఏజెంట్లకు వ్యాక్సినేషన సర్టిఫికెట్‌ తప్పనిసరి : కలెక్టర్‌

జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల కౌంటింగ్‌లో పాల్గొనే ఏజెంట్లు, అభ్యర్థులు, సిబ్బందికి వ్యాక్సినేషన వేయించుకున్న సర్టిఫికెట్‌ లేదా కొవిడ్‌ నెగిటివ్‌ వచ్చినట్లుగా ఉన్న రిపోర్టు తప్పనిసరని జిల్లా కలెక్టర్‌ నాగలక్ష్మి పేర్కొన్నారు. వ్యాక్సి నేషన సర్టిఫికెట్‌ లేని వారు శనివారం కొవిడ్‌ టెస్టులు చేయించుకునేందుకు ఏర్పాట్లు చేశామన్నారు. శుక్రవారం ఆమె జిల్లా ఎస్పీతో కలిసి జేఎనటీయూ, కేఎస్‌ఎన మహిళా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో చేపట్టిన కౌంటింగ్‌ ఏర్పా ట్లను పరిశీలించారు. అనంతరం కలెక్టర్‌ మీడియాతో మా ట్లాడుతూ ఎన్నికల బరిలో నిలిచిన అభ్యర్థులు తమ ఏజెంట్ల నియామకాలకు సంబంధించిన పనులు పూర్తి చేసుకోవాలని ఆదేశించారు. రిటర్నింగ్‌ అధికారి ఇచ్చిన పాస్‌తో పాటు గుర్తింపు కార్డు ఉన్న వారిని మాత్రమే ఏజెంటుగా వ్యవహరించేందుకు అవకాశం కల్పిస్తామన్నా రు. కౌంటింగ్‌ అనంతరం గెలిచిన అభ్యర్థులు గుంపులు గుంపులుగా చేరి సంబరాలు చేసుకోవడం, బాణసంచా కాల్చడం నిషేధించినట్టు వివరించారు. కౌంటింగ్‌ రోజు జిల్లా వ్యాప్తంగా 144 సెక్షన అమల్లో ఉంటుందన్నారు. కొవిడ్‌ను దృష్టిలో ఉంచుకొని అభ్యర్థులు బాధ్యతాయు తంగా వ్యవహరించాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కౌం టింగ్‌ ప్రక్రియ సజావుగా నిర్వహించేలా పటిష్ట బందో బస్తు చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. కా ర్యక్రమంలో ఆర్డీఓ మధుసూదన, డీఆర్‌డీఏ పీడీ నరసింహారెడ్డి, మెప్మా పీడీ రమణారెడ్డి, రిటైర్డ్‌ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ గోవిందరాజులు, డీఎస్పీలు వీరరాఘవరె డ్డి, ప్రసాద్‌రెడ్డి, ఎంపీడీఓ, ఈఓపీఆర్డీలు, ఎన్నికల అదికారులు తదితరులు పాల్గొన్నారు.