Abn logo
Sep 17 2021 @ 21:56PM

కౌంటింగ్‌ కేంద్రాల వద్ద 144వ సెక్షన్‌ అమలు

మాట్లాడుతున్నరూరల్‌ డీఎస్పీ హరనాథరెడ్డి

కోవూరు, సెప్టెంబరు 17 : మండలంలోని నార్తురాజుపాళెంలో బ్రహ్మయ్య ఇంజనీరింగ్‌ కళాశాలలో  ఆదివారం ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల లెక్కింపు జరగనున్నందున కౌంటింగ్‌ కేంద్రాల సమీపంలో  144వ సెక్షన్‌ అమలు చేస్తున్నట్లు రూరల్‌ డీఎస్పీ హరనాథరెడ్డి తెలిపారు. పోలీసు సర్కిల్‌ పరిధిలోని గ్రామాల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఫలితాల గురించి ఆయన శుక్రవారం సీఐ కార్యాలయంలో వివరించారు. పార్టీల నాయకులు, అభ్యర్థులు, ఏజెంట్లు విధిగా కొవిడ్‌ నిబంధనలు పాటించాలన్నారు. ఆయన వెంట సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్‌ఐ డీ వెంకటేశ్వరరావు ఉన్నారు. 


ఎన్నికల కౌంటింగ్‌కు ఏర్పాట్లు పూర్తి 

ఇందుకూరుపేట  : రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మండలంలో ఎన్నికల కౌంటింగ్‌ను ఆదివారం ప్రారంభిస్తున్నట్లు మండల ప్రత్యేకాధికారి, డ్వామా పీడీ తిరుపతయ్య తెలిపారు. మండల కార్యాలయంలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఆదివారం ఉదయం 8 గంటలకు మండలానికి చెందిన 17 ఎంపీటీసీ, ఒక జడ్పీటీసీ స్థానాలకు లెక్కింపు జరుగుతుందన్నారు. కొడవలూరు మండలం జాతీయరహదారి సమీపంలోని బ్రహ్మయ్య ఇంజనీరింగ్‌ కాలేజీలో ఈ కౌంటింగ్‌ ప్రక్రియ మొదలవుతుందని తెలిపారు.  ఈ క్రమంలో ఏజెంట్లు, ఇతర సిబ్బంది ధ్రువీకరణ పత్రాలతో మండలంలో ప్రత్యేక కౌంటర్‌ వద్ద శనివారం సాయంత్రంలోపు నమోదు చేసుకుని, అనుమతి పొందాలన్నారు. కొవిడ్‌ నిబంధనలు తప్పకుండా పాటించాలని,  అలాగే 144 సెక్షన్‌ అమలులో ఉంటుందని తెలిపారు. సమావేశంలో ఎంపీడీవో రఫీఖాన్‌, ఎస్‌ఐ శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. 

ముత్తుకూరు : ముత్తుకూరు మండలంలో 17 ఎంపీటీసీ స్థానాల్లో 8 ఎంపీటీసీ స్థానాలు ఏకగ్రీవంగా ఎంపికయ్యాయి. బ్రహ్మదేవం-1, బ్రహ్మదేవం-2, పొట్టెంపాడు, పిడతాపోలూరు-1. పిడతాపోలూరు-2, పైనాపురం, నేలటూరు, బ్రహ్మదేవం-1, వల్లూరు ఎంపీటీసీ సభ్యులుగా ఏకగ్రీవంగా ఎంపికయ్యారు. దొరువులపాళెం, పంటపాళెం, ముత్తుకూరు-1,2,3,4, కృష్ణపట్నం-1,2, నారికేళపల్లి స్థానాల్లో ఎన్నికలు జరిగాయి. ఈ 9 ఎంపీటీసీ స్థానాలకు ఆదివారం కౌంటింగ్‌ నిర్వహించనున్నారు. ముత్తుకూరు జడ్పీటీసీ స్థానం ఎన్నికల ఫలితాలు ఆదివారం తేలనున్నాయి.

తోటపల్లిగూడూరు  : కొవిడ్‌ నెగిటివ్‌ రిపోర్టు ఉన్న వారిని మాత్రమే కౌంటింగ్‌ హాల్లోకి అనుమతించడం జరుగుతుందని ఎంపీడీవో కన్నం హేమలత స్పష్టం చేశారు. ఈనెల 19న నిర్వహించనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఓట్ల లెక్కింపు ప్రక్రియను పురస్కరించుకుని మండల ఎంపీడీవో కార్యాలయంలో శుక్రవారం ప్రత్యేక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మండల ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి, తహసీల్దారు శ్యామలమ్మ, ఎంపీడీవో హేమలత, యూఎస్‌హెచ్‌వో పాల్గొన్నారు.