Abn logo
Sep 20 2021 @ 00:50AM

పకడ్బందీగా కౌంటింగ్‌

నరసన్నపేటలో కౌటింగ్‌ చేపడుతున్న సిబ్బంది


ప్రాదేశిక ఎన్నికల లెక్కింపు పూర్తి

 పరిశీలించిన అధికారులు

టెక్కలి/టెక్కలి రూరల్‌: ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల కౌంటింగ్‌  ప్రక్రియ ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. చిన్నచిన్న సంఘటనలు మినహా ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగలేదు. ఆదిత్య ఇంజినీరింగ్‌ కళాశాలలో ఆదివారం ప్రశాంతంగా జరిగాయి. ఈ ప్రక్రియను పలువురు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఎస్పీ అమిత్‌ బర్దర్‌, ఎన్నికల పరిశీలకుడు కేబీహెచ్‌ఎన్‌ చక్రవర్తి, జేసీ శ్రీనివాసులు పరిశీలించి కౌంటింగ్‌ వేగవంతానికి సూచనలు చేశారు. కౌంటింగ్‌ ప్రక్రియను టెక్కలి సబ్‌ కలెక్టర్‌ వికాస్‌ మర్మట్‌ నాలుగు మండలాల ఆర్‌వోలు, ఏఆర్‌వోలతో సమీక్షించారు. 


పాతపట్నంలో...

పాతపట్నం: స్థానిక బాలయోగి గురుకుల ఆశ్రమ పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని పలువురు అధికారులు సందర్శించారు. ఐటీడీఏ పీవో సీహెచ్‌ శ్రీధర్‌,  జేసీ హిమాన్షు కౌషిక్‌ పరిశీలించి సిబ్బందితో సమీక్షించారు.  


నరసన్నపేటలో...

నరసన్నపేట: స్థానిక ప్రభుత్వ డిగ్రీకళాశాలలో ఆదివారం చేపట్టిన ఎంపీటీసీ ఓట్లు లెక్కింపు కార్యక్రమం ప్రశాంతంగా జరిగింది. జలు మూరు మండలం అంధవరం కౌంటింగ్‌ కేంద్రంలో ఏజెంట్ల మధ్య గొడవ జరిగింది. మాకివలస ఎంపీటీసీ స్థానానికి ఓట్లు లెక్కింపు చివర వరకు ఉత్కంఠంగా సాగింది. కౌటింగ్‌ కేంద్రాలను ఎస్పీఅమిత్‌ బర్దర్‌,  పరిశీల కుడు చక్రవర్తి, ఆర్డీవో కిశోర్‌, సెబీ ఏఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పరిశీ లించారు. ఇది లా ఉండగా కౌంటింగ్‌ కేంద్రాల్లోని మీడియా ప్రతినిధులను అనుమతించవద్దని డీఎస్పీ మహేంద్ర సూచించడంతో ఎవరినీ అనుమతించలేదు. అయితే అధికారులు, సిబ్బంది మాత్రం సెల్‌ఫోన్లతో అటూ ఇటూ తిరుగుతూ వాట్సప్‌, మెసేజ్‌లను నేరుగా అందజేశారు.



రాజాంలో...

 రాజాం/రూరల్‌: స్థానిక డీఏవీ పబ్లిక్‌ స్కూల్‌లో ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి కౌంటింగ్‌ ప్రక్రియ సాగింది. ఈ కేంద్రాలను జాయింట్‌ కలెక్టర్‌ హిమాన్షు కౌషిక్‌, ఏఎస్పీ సోమశేఖర్‌, ఎన్నికల అధికారి హెచ్‌.కూర్మారావు పరిశీలించారు. రిజర్వ్‌లో ఉంచిన 50 మంది సిబ్బందికి ఉదయం 11 గంటల వరకు వారికి ఎటువంటి పని అప్పగించలేదు. కేంద్రంలో ఉన్న వారిని పోలీసులు బయటకు పంపేయడంతో వారంతా వెనుదిరిగారు.



పలాసలో...

 పలాస: పలాస నియోజకవర్గంలో ప్రాదేశిక ఎన్నికల  ఓట్ల లెక్కింపు కట్టుదిట్టమైన భద్రత మధ్య ఆదివారం నిర్వహించారు. ఓట్ల లెక్కింపు కేంద్రాన్ని జేసీ శ్రీనివాసులు, ఏఎస్పీ విఠలేశ్వరరావు సందర్శిం చారు. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో కౌంటింగ్‌ ప్రక్రియను ఎన్నికల అధికారి మెప్మా పీడీ కిరణ్‌కుమార్‌, సహాయ ఎన్నికల అధికారులు ఎన్‌.రమేష్‌ నాయుడు, ఎల్‌.మధుసూదనరావు, కాశీబుగ్గ సీఐ ఎస్‌.శంకర రావు పర్యవేక్షించారు.