Abn logo
Jun 13 2021 @ 01:20AM

సరిహద్దుల్లో నకిలీ విత్తనాలను అడ్డుకోవాలి

వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జిల్లా ఎస్పీ, వ్యవసాయ శాఖ అధికారులు

వీడియో కాన్ఫరెన్స్‌లో వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్‌రెడ్డి

ఆదిలాబాద్‌ అర్బన్‌, జూన్‌ 12: నకిలీ పత్తి, మిర్చి విత్తనాలు ఇతర రాష్ర్టాల సరి హద్దు గుండా సరఫరా కాకుండా అడ్డుకోవాలని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నీరంజన్‌రెడ్డి పేర్కొన్నారు. రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి, వ్యవసాయ శాఖ ప్రధానన కార్యదర్శి రఘునంద్‌రావ్‌, నార్త్‌జోన్‌ ఐజీపీ వై.నాగిరెడ్డితో కలిసి శనివారం రాష్ట్ర పోలీసు, వ్యవసాయ  అధికారు లతో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ సమా వేశంలో జిల్లా తరపున ఎస్పీ ఎం.రాజేశ్‌ చంద్ర, వ్యవసాయ అధి కారి ఎన్‌.రమేష్‌ హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లా డుతూ కేంద్ర ప్రభుత్వం అనుమతించని బీటీ-3 పత్తి విత్తనాలతో పాటు నకిలీ మిర్చి విత్తనాల పై ప్రధాన దృష్టి సారించాలని సూ చించారు. కల్తీ రహిత విత్తనాల రాష్ట్రంగా తీర్చిదిద్దాలని ప్రభుత్వ లక్ష్యం నెరవేర్చే సామర్థ్యం పోలీసు, వ్యవసాయ శాఖ అధికారులకు ఉందన్నారు. గత పది రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా సంయుక్తంగా ఏర్పాటు చేసిన టాస్క్‌ఫోర్స్‌ దాడుల్లో భారీగా నకిలీ విత్తనాలను స్వాదీనం చేసుకొని నిందితుల పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రాష్ట్ర పోలీసు అధికారులు ప్రత్యేక అభినందనలు తెలుపుతున్నట్లు వెల్లడించా రు. నకిలీ విత్తనాలు తరుచుగా సరఫరా చేయడానికి అలవాటు పడిన నిందితులపై పీడీ యాక్ట్‌ అమలు చేయాలని సూచించారు. వచ్చే 15 రోజులు అత్యంత కీలకమైనవని, ముఖ్యంగా సరిహద్దు ప్రాంతంలో అదనపు బలగాలను మోహరించి నకిలీ విత్తనాలు జిల్లాలో చేరకుండా కట్టడి చేయాలన్నారు. బీటీ -3 పత్తి విత్తనాలతో వ్యవ సాయ భూమి విషతుల్యం అవుతుందని, భవిష్యత్తులో భూమి సా రం నశించి పోతుందన్నారు.రాష్ట్ర డీజీపీ ఎం.మహేందర్‌రెడ్డి మా ట్లాడుతూ  నకిలీ విత్తనాలను కట్టడి చేసి రైతు  సుబిక్షంగా ఉండ డానికి  ఏ ఒక్క రైతు నకిలీ విత్తనాలతో నష్టపోకుండా కఠిన చర్య లు తీసుకుంటున్నామని తెలిపారు. రాష్ట్రంలో ప్రతి రెండు జిల్లాలకు డీఎస్పీ ఆధ్వర్యంలో స్టేట్‌ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి దాడులను ముమ్మరం చేశామని తెలిపారు. నకిలీ విత్తనాలతో పట్టుబడిన కేసుల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించి, నిందితులకు న్యాయ స్థానంలో కఠిన విక్షపడే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఎం.రాజేశ్‌చంద్ర మాట్లాడుతూ టాస్క్‌ఫోర్స్‌ ఏర్పాటు చేసి 24 మంది నిందితులపై తొమ్మిది కేసులు నమోదు చేసినట్లు తెలిపారు. సరిహద్దు ప్రాంతాల్లో చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి ఇతర రాష్ర్టాల నుంచి వచ్చే వాహనాలను తనిఖీ చేస్తున్నట్లు తెలిపారు. నకిలీ విత్తనాలతో రైతులు మోసపోవద్దని గోడపత్రాలు, ఫ్లెక్సీ, బ్యానర్లు, పాంప్లెట్లు తదితర అంశాల పై అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలి పారు. ప్రతీ గ్రామాల్లో వెళ్లి రైతులతో నేరుగా సమావేశమై బీటీ మూడు విత్తనాలతోకలిగే అనర్థాలను వివరిస్తున్నట్లు తెలిపారు. డీలర్లకు చెందిన దుకాణాలు, గోడౌన్లలో అకస్మీకంగా తనిఖీలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో డీఎస్పీ ఎన్‌ఎస్‌వీ వెంకటేశ్వర్‌రావు, స్పెషల్‌ బ్రాంచ్‌ ఇన్‌స్పెక్టర్‌ జి.మల్లేష్‌, టాస్క్‌ఫోర్స్‌ ఇన్‌స్పెక్టర్‌ ఇ.చంద్రమౌళి, జిల్లా వ్యవసాయ అధికారి  ఎన్‌.రమేష్‌, హార్టికల్చర్‌ అధికారి జి.శ్రీనివాస్‌రెడ్డి, కమ్యూనికేషన్‌ ఎస్సై గంగాసాగర్‌, తదితరులు పాల్గొన్నారు.