Abn logo
Oct 13 2020 @ 01:44AM

పాసుపుస్తకాల్లో తప్పులను సరిచేయండి

Kaakateeya

శామీర్‌పేట రూరల్‌: పట్టాదారు పాసుపుస్తకాల్లో తప్పులను సరిచేయాలని మేడ్చల్‌ జిల్లా రెవెన్యూ జాయింట్‌ కలెక్టర్‌ విద్యాసాగర్‌కు సోమవారం ఎంపీపీ హారిక ఆధ్వర్యంలో సర్పంచ్‌ ఆంజనేయులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ సీఎం దత్తత గ్రామంలో కొత్తగా నక్ష రూపొందించారని తెలిపారు. రైతులకు పంపిణీ చేసిన సుమారు 300 పట్టాదారు పాసుపుస్తకాల్లో రైతుల పేర్లు, విస్తీర్ణం, సర్వే నెంబర్లు తప్పుగా నమోదయ్యాయని చెప్పారు. సేత్వార్‌లో  రైతుల భూవివరాలు తప్పుగా పడ్డాయని, దీంతో ప్రభుత్వం ప్రవేశ పెడుతున్న రైతుబంధు, రైతుబీమా పథకాలకు అనర్హులుగా మిగులుతున్నారని వివరించారు. సర్వే అధికారులు స్పందించి తప్పులను సరిచేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్‌ఎస్‌ నాయకుడు జహాంగీర్‌, రైతుసంఘం అధ్యక్షుడు నర్సింగరావు, చిత్తగౌడ్‌, ఏడీ రాంచందర్‌  తదితరులు పాల్గొన్నారు. 

Advertisement
Advertisement