Abn logo
Dec 2 2020 @ 00:16AM

30 పాజిటివ్‌ కేసులు నమోదు

కడప, డిసెంబరు 1 (ఆంధ్రజ్యోతి): జిల్లాలో 30 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదైనట్లు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం వెల్లడించింది. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 54,567కు చేరుకుంది. ఇప్పటి వరకు 521 మంది మృతి చెందారు. కొవిడ్‌ ఆసుపత్రుల్లో చికిత్స పొంది కోలుకున్న 61 మందిని డిశ్చార్జి చేశారు. ఇప్పటి వరకు 53,856 మంది కరోనాను జయించారు. 274 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారు.

Advertisement
Advertisement
Advertisement