Abn logo
Mar 31 2020 @ 17:41PM

కీలక నిర్ణయం తీసుకున్న కేంద్ర ప్రభుత్వం

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. వాహనాల యజమానులు, డ్రైవర్లకు సంబంధించిన డాక్యుమెంట్ల కాల పరిమితిని పొడిగించినట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. లాక్‌డౌన్‌ కాలంలో రవాణాకు సంబంధించి వాహనాల యజమానులు, డ్రైవర్లు ఇబ్బందులు పడకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు రహదారుల మంత్రిత్వ శాఖ తెలిపింది. ఫిట్‌నెస్ సర్టిఫికేట్స్, అన్ని రకాల పర్మిట్స్, డ్రైవింగ్ లైసెన్స్‌లు, రిజిస్ట్రేషన్లతోపాటు ఇతర పత్రాల కాల పరిమితిని జూన్ 30,2020 వరకు పొడి గిస్తున్నట్లు రవాణా మరియు రహదారుల మంత్రిత్వ శాఖ పేర్కొంది. ఫిబ్రవరి 1 తర్వాత కాల పరిమితి చెల్లిన పత్రాలకు మాత్రమే ఈ నిబంధనలు వర్తిస్తాయని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. కరోనా వైరస్‌ను నియంత్రించేందుకు కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మార్చి 25 నుంచి ఏప్రిల్ 14 వరకు లాక్‌డౌన్‌ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో వాహనాల యజమానులు, డ్రైవర్లకు కేంద్ర ప్రభుత్వం ఊరట కలిగించింది. లాక్‌డౌన్‌ కాలంలో అన్ని రాష్ట్రాల ట్రాన్స్‌పోర్టుల కార్యాలయాలు మూతపడ్డాయి.

Advertisement

జాతీయంమరిన్ని...

Advertisement
Advertisement