Abn logo
Aug 7 2020 @ 01:30AM

అమెరికాలో కరోనా విలయం.. అరకోటి దాటిన కేసుల సంఖ్య!

వాషింగ్టన్: కరోనా వైరస్ ప్రపంచానికి కంటి మీద కునుకు లేకుండా చేస్తోంది. అగ్రరాజ్యం అమెరికానూ ఈ మహమ్మారి అతలాకుతలం చేస్తోంది. అమెరికాలో ప్రతి రోజూ రికార్డు స్థాయిలో కరోనా కేసులు, మరణాలు సంభవిస్తున్నాయి. ఇదిలా ఉంటే.. వరల్డ్ఒమీటర్.ఇన్‌ఫోలోని సమాచారం ప్రకారం.. గడిచిన 24 గంటల్లో అమెరికాలో 35వేలపైగా కరోనా కేసులు నమోదవ్వగా.. అగ్రరాజ్యంలో కొవిడ్-19 బాధితుల సంఖ్య అరకోటి దాటింది. ఇదే సమయంలో 671 మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోగా.. మహమ్మారి కాటుకు బలైన వారి సంఖ్య 1.62లక్షలు దాటింది. కరోనా కేసులు అత్యధికంగా ఉన్న రాష్ట్రాల జాబితాలో కాలిఫోర్నియా(5.35 లక్షలు) , ఫ్లోరిడా(5.10లక్షలు), టెక్సాస్ (4.82లక్షలు), న్యూయార్క్(4.47లక్షలు), జార్జియా (2.04లక్షలు) రాష్ట్రాలు వరుసగా మొదటి ఐదు స్థానాల్లో ఉన్నాయి. కొవిడ్ మరణాలు అత్యధికంగా నమోదైన రాష్ట్రాల జాబితాలో న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా రాష్ట్రాలు వరుసగా మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయి. ఇదిలా ఉంటే.. అమెరికాలో కరోనా నుంచి కోలుకున్న వారి సంఖ్య 25లక్షలు దాటింది. ప్రస్తుతం  అమెరికాలో దాదాపు 23లక్షలపైగా యాక్టివ్ కేసులు ఉన్నాయి. 


Advertisement
Advertisement
Advertisement