Abn logo
Mar 26 2020 @ 08:02AM

ఇటలీలో మాస్కుల కొరత ... స్పెయిన్ లో టెంట్ లలో చికిత్సలు

రోమ్: స్పెయిన్, ఇటలీల నుంచి  ప్రపంచానికి వినిపిస్తున్న కరోనా వైరస్ కదిలించే కథలు అందరికి షాక్ ఇస్తున్నాయి. ఈ రెండు దేశాలలో కరోనాకు చికిత్స అందిస్తున్న వైద్యులు, నర్సులు ఈ వ్యాధికి లోనవుతున్నారు. ఇటలీలో గౌన్లు, గ్లోవ్స్, మాస్క్‌ల కొరత తీవ్రంగా ఉంది. అక్కడి వైద్యులు ప్రభుత్వానికి లేఖ రాస్తూ... మమ్మల్ని ఇలా వదిలిపెట్టడం తగదని విజ్ఞప్తి చేస్తున్నారు. యూనివర్సల్ హెల్త్ కేర్ గా గుర్తింపు పొందిన స్పెయిన్ ఇప్పుడు సమస్యల్లో చిక్కుకుంది. కరోనా రోగులు గుడారాలలో చికిత్స పొందుతున్నారు. స్పెయిన్‌కు చెందిన వార్తా సంస్థ ఈ వివరాలను వెల్లడించింది. స్పెయిన్ కు చెందిన 32 ఏళ్ల నర్సు కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షల తరువాత  కరోనా పాజిటివ్ అని తేలింది. త్వరలోనే  కోలుకుని ఆసుపత్రికి వెళ్లి, పనిభారంతో బాధపడుతున్న తన సహోద్యోగులకు సహాయం చేస్తానని ఆ నర్స్ చెప్పారు.

Advertisement
Advertisement
Advertisement