Abn logo
Mar 25 2020 @ 18:32PM

కరోనా పోవాలని ఇంట్లోనే నమాజ్ చేస్తున్నా: అలీ

కరోనా కట్టడికి దేశవ్యాప్తంగా సంపూర్ణ బంద్ పాటిస్తున్న విషయం తెలిసిందే. ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రావొద్దన్న కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సూచనలతో హీరో అలీ కూడా ఇంట్లోనే ఉంటున్నారు. కుటుంబ సభ్యులతో గడుపుతున్నారు. కరోనా కట్టడికి ఆయన విరాళం ప్రకటించారు. ఏపీ, తెలంగాణకు రూ. లక్ష చొప్పున మొత్తం రెండు లక్షల రూపాయలు అందజేయనున్నారు. గొప్పవాళ్లందరూ సాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. కరోనాను కట్టడి చేసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు ప్రజలు సహకరించాలని అలీ కోరారు. కరోనా వైరస్‌పైకి పోవాలని ఇంట్లోనే నమాజ్ చేస్తున్నానని తెలిపారు. కరోనా వైరస్ పై నెగిటివ్ ప్రచారం చేయొద్దని సూచించారు. ఈ సమయంలో నిత్యావసరాల ధరలు పెంచొద్దని, మానవత్వం చాటుకోవాలని అలీ విజ్ఞప్తి చేశారు. 


Advertisement
Advertisement
Advertisement