Abn logo
Apr 3 2020 @ 09:43AM

నితిన్ బిజినెస్‌కు క‌రోనా వైర‌స్ బ్రేక్‌

యువ క‌థానాయ‌కుడు నితిన్ ఈ ఏడాది భీష్మ‌తో పెద్ద హిట్‌నే సొంతం చేసుకున్నాడు. అలాగే పెళ్లి కూడా చేసుకోవాల‌నుకున్నాడు. అయితే క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో నితిన్ పెళ్లిని వాయిదా వేసుకున్నాడు. అయితే ఇప్పుడు క‌రోనా వైర‌స్ మ‌రో విష‌యంలోనూ నితిన్‌కు విల‌న్‌గా మారింది. అదేంటంటే.. భీష్మ స‌క్సెస్ త‌ర్వాత నితిన్ కీర్తి సురేశ్‌తో క‌లిసి రంగ్‌దే సినిమాలో న‌టిస్తున్నారు. వెంకీ అట్లూరి ద‌ర్శ‌క‌త్వంలో సూర్య‌దేవ‌ర నాగ‌వంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమా శాటిలైట్‌, డిజిట‌ల్ హ‌క్కుల‌ను ఓ ప్ర‌ముఖ ఛానెల్ దాదాపు రూ.11 కోట్ల‌కు డీల్ కుదుర్చుకున్న‌ట్లు స‌మాచారం. అంతా ఓకే అనుకుంటున్న త‌రుణంలో క‌రోనా వైర‌స్ ప్ర‌భావంతో డీల్‌ను హోల్డ్‌లో పెట్టేశార‌ట‌. ఇలా క‌రోనా నితిన్‌ను మ‌రోసారి ఇన్ డైరెక్ట్‌గా ఇబ్బంది పెట్టేసింది. త్వ‌ర‌లోనే సినిమాను ప్రేక్ష‌కుల ముందుకు తీసుకురానున్నారు. క‌రోనా ప్ర‌భావం త‌గ్గిన త‌ర్వాత రిలీజ్ డేట్‌పై ఓ క్లారిటీ వ‌స్తుంద‌ని స‌మాచారం.

Advertisement
Advertisement
Advertisement