Abn logo
May 4 2021 @ 02:40AM

కారు దిగకుండానే కరోనా పరీక్ష

‘డ్రైవ్‌- త్రూ- ఆర్టీపీసీఆర్‌’ టెస్టులు అందుబాటులోకి

హైదరాబాద్‌ సిటీ, మే 3 (ఆంధ్రజ్యోతి) : కారు నుంచి దిగకుండానే కరోనా పరీక్షలు చేయించుకునే సౌకర్యం ఇప్పుడు హైదరాబాద్‌లోనూ అందుబాటులోకి వచ్చింది. ‘డ్రైవ్‌-త్రూ-ఆర్టీపీసీఆర్‌ పరీక్ష’ను టెనెట్‌ డయాగ్నస్టిక్స్‌ సంస్థ సోమవారం మాదాపూర్‌లోని హైటెక్స్‌ వద్ద ప్రారంభించింది. ప్రజల ఆరోగ్య భద్రత, సౌలభ్యం కోసం డ్రైవ్‌-త్రూ-ఆర్టీపీసీఆర్‌తో పాటు కొవిడ్‌ ఇన్‌ఫ్లమేటరీ మార్కర్స్‌ పరీక్షలను కూడా నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రకటించింది. ఉదయం 9 నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఈ సేవలు అందుబాటులో ఉంటాయని తెలిపింది. హైటెక్స్‌ వద్ద ఉన్న గేట్‌ - 1 వద్దకు వెళ్లి కారులోనే కూర్చొని సౌకర్యవంతంగా రిజిస్ట్రేషన్‌ ప్రక్రియను పూర్తి చేసుకొని, పాన్‌కార్డు లేక ఆధార్‌ కార్డు వంటి ధ్రువపత్రాలను చూపించాల్సి ఉంటుంది. యూపీఐ/కార్డ్‌/గూగుల్‌ పే మొదలైన పద్ధతుల్లో చెల్లింపులు చేసి నమూనాలు ఇవ్వొచ్చు. ఈ మొత్తం ప్రక్రియ కొద్ది నిమిషాల్లోనే పూర్తవుతుంది. 24 నుంచి 48 గంటల వ్యవధిలోనే పరీక్ష నివేదిక అందిస్తారు. వివరాలకు 86880 86880 నంబర్‌లో లేదా www.tenetdiagnostic.in ను సంప్రదించాలని టెనెట్‌ సంస్థ ప్రతినిధులు సూచించారు. 

Advertisement
Advertisement
Advertisement