Abn logo
Oct 22 2021 @ 22:25PM

ఇంటర్మీడియట్‌ పరీక్షల్లో కరోనా నిబంధనలు పాటించాలి

పరీక్ష కేంద్రంలో అధికారులకు సూచనలు ఇస్తున్న కలెక్టర్‌

మంచిర్యాల కలెక్టరేట్‌, అక్టోబరు 22: ఇంటర్మీడి యట్‌ ప్రథమ సంవత్సరం పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని, కరోనా నిబంధనలు పాటించాలని కలెక్టర్‌ భారతి హోళికేరి సూచించారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అల్ఫోర్స్‌, ప్రతిభ జూనియర్‌ కళా శాలల్లో ఏర్పాటు చేసిన పరీక్ష కేంద్రాలను పరిశీలిం చారు. అనంతరం కలెక్టర్‌ మాట్లాడుతూ ఈ నెల 25వ తేదీ నుంచి నవంబర్‌ 3 వరకు పరీక్షలు జరుగుతా యని, విద్యార్థులు కొవిడ్‌ నిబంధనలు పాటించేలా సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. పరీక్ష కేంద్రాల్లో తాగునీరు, విద్యుత్‌, ఇతర సౌకర్యా లతో పాటు వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచా లని అధికారులను ఆదేశించారు. రోజు పరీక్ష కేంద్రా లను శానిటైజ్‌ చేయాలన్నారు. జిల్లాలో 37 పరీక్ష కేం ద్రాలను ఏర్పాటు చేశామని, 8367 మంది పరీక్షలు రాయనున్నట్లు తెలిపారు. జిల్లా ఇంటర్మీడియట్‌ అధికారి శైలజ, సంబంధిత అధికారులు పాల్గొన్నారు. 

కలెక్టరేట్‌ పనులు త్వరగా పూర్తిచేయాలి

నస్పూర్‌: సమీకృత కలెక్టరేట్‌ నిర్మాణ పనులు త్వర గా పూర్తి చేయాలని అదనపు కలెక్టర్‌ మధుసూదన్‌ నాయక్‌ అన్నారు. నస్పూర్‌లో కలెక్టరేట్‌ నిర్మాణ పనులను ఆయన శుక్రవారం పరిశీలించారు. కలెక్టరేట్‌ భవన నిర్మాణం, క్యాంపు కార్యాలయం, అదనపు కలె క్టర్ల, జిల్లా అధికారుల నివాస గృహాల పనులు వేగవం తం చేయాలన్నారు. నిర్మాణ పనులు పరిశీలించి అధి కారులకు సూచనలు, సలహాలను ఇచ్చారు. నస్పూర్‌, మంచిర్యాల తహసీల్దార్లు జ్యోతి, రాజేశ్వర్‌, నాయబ్‌ తహసీల్దార్‌ సంతోష్‌, రోడ్ల భవనాల శాఖ ఈఈ రాములు పాల్గొన్నారు.