Abn logo
Oct 2 2020 @ 00:43AM

కరోనా మరణమృదంగం

Kaakateeya

రంగారెడ్డి జిల్లాలో ముగ్గురు మృతి


(ఆంధ్రజ్యోతి, రంగారెడ్డి అర్బన్‌) : ఉమ్మడి జిల్లాలో కరోనా మరణ మృదంగం మోగుతోంది. రంగారెడ్డి జిల్లాలో మూడు రోజులుగా వరుసగా వైర్‌సతో మృతి చెందిన కేసులు నమోదవుతున్నాయి. గురువారం జిల్లాలో ముగ్గురు కరోనాతో మృతి చెందారు. మృతుల్లో జీహెచ్‌ఎంసీలో ఒకరు, నాన్‌జీహెచ్‌ఎంసీలో ఇద్దరున్నారు. రంగారెడ్డి, వికారాబాద్‌, మేడ్చల్‌ జిల్లాలో కరోనాతో మృతి చెందిన వారి సంఖ్య 261కి చేరుకుంది. 


828 పాజిటివ్‌లు

ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో గురువారం 828 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. మేడ్చల్‌ జిల్లాలో 426, రంగారెడ్డి జిల్లాలో 377, వికారాబాద్‌ జిల్లాలో 25 కేసులు నమోదయ్యాయి. 


చేవెళ్ల డివిజన్‌లో..

చేవెళ్ల : చేవెళ్ల డివిజన్‌లో 241మందికి కరోనా పరీక్షలు చేయగా 28 మందికి పాజిటివ్‌గా తేలింది. అలాగే చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రిలో 42 మందికి పరీక్షలు చేయగా 7, ఆలూర్‌ ప్రాథమిక ఆసుప్రతిలో 65 పరీక్షలు చేయగా 6, శంకర్‌పల్లి మండలంలో 34 మందికి పరీక్షలు చేయగా 6, మొయినాబాద్‌ మండలంలో 44మందికి పరీక్షలు చేయగా 5, షాబాద్‌ మండలంలో 56మందికి పరీక్షలు చేయగా నలుగురికి పాజిటివ్‌ వచ్చింది.


ఇబ్రహీంపట్నం, కందుకూరు, శంషాబాద్‌లో..

ఇబ్రహీంపట్నం / కందుకూరు / శంషాబాద్‌ : ఇబ్రహీంపట్నం డివిజన్‌లో 393 మందికి కరోనా టెస్టులు నిర్వహించగా 33 మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇబ్రహీంపట్నం సీహెచ్‌సీలో 38 మందికి పరీక్షలు చేయగా 4, అబ్దుల్లాపూర్‌మెట్‌లో 40 మందికిగాను 8, యాచారంలో 32 మందికిగాను 1, దండుమైలారంలో 33 మందికిగాను 1, ఎలిమినేడులో 23 మందికిగాను 5, మాడ్గులలో 32 మందికిగాను 1, సీహెచ్‌సీ హయత్‌నగర్‌లో 39 మందికిగాను 3, తట్టిఅన్నారంలో 37 మందికిగాను 7, రాగన్నగూడలో 54 మందికిగాను ముగ్గురికి పాజిటివ్‌ అని తేలింది. కందుకూరు ప్రభుత్వ ఆరోగ్య కేంద్రంలో 61మందికి కరోనా పరీక్షలు చేయగా తుక్కుగూడ మున్సిపాలిటీ పరిధిలోని ప్రజ్వలహోమ్స్‌కు చెందిన ఒకరికి పాజిటివ్‌ వచ్చింది. శంషాబాద్‌లో 46మందికి  కరోనా పరీక్షలు చేయగా 7పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. 


షాద్‌నగర్‌ డివిజన్‌లో..

షాద్‌నగర్‌ : షాద్‌నగర్‌ డివిజన్‌లో 249మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 15మందికి పాజిటివ్‌ వచ్చింది. ఇందులో షాద్‌నగర్‌కు చెందిన ముగ్గురు, కొత్తూర్‌ మండలానికి చెందిన ఆరుగురు, ఫరూఖ్‌నగర్‌ మండలానికి చెందిన ఇద్దరు, కొందుర్గు మండలానికి చెందిన ఇద్దరు, నందిగామ మండలానికి చెందిన ఇద్దరు ఉన్నారు.


ఆమనగల్లులో..

ఆమనగల్లు : ఆమనగల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా పరీక్షలు నిర్వహించారు. ఆమనగల్లు, కడ్తాల, తలకొండపల్లి మండలాల పరిధిలోని 52 మందికి పరీక్షలు నిర్వహించగా ఆమనగల్లు మున్సిపాలిటీకి చెందిన ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది.


కరోనాతో  యువకుడి మృతి

మాడ్గుల : మాడ్గుల మండలం నల్ల చెర్వు గ్రామానికి చెందిన పేట రమేష్‌ (25)అనే యువకుడు కరోనా బారినపడి మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. కొన్నిరోజుల నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న యువకుడు హైదరాబాద్‌లోని ఓ ప్రవేటు ఆస్పత్రిలో చేరాడు. అకష్ట్రడ అతనికి కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌ వచ్చింది. దీంతో అతన్ని గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతిచెందినట్లు గ్రామస్థులు తెలిపారు. యువకుడి మృతదేహాన్ని గాంధీ ఆస్పత్రి నుంచి నల్లచెర్వుకు తీసుకొచ్చి వ్యవసాయ పొలంలో ఖననం చేశారు(పూడ్చిపెట్టారు). డ్రైవర్‌గా పనిచేస్తున్న మృతునికి భార్య స్వాతి, ఒక కుమారుడు ఉన్నారు. భార్య ప్రస్తుతం నిండు గర్భవతి  కావడంతో గ్రామంలో విషాదఛాయలు నెలకొన్నాయి. 


పరిగి, కులకచర్లలో..

పరిగి / కులకచర్ల: పరిగిలో 22 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా ఇద్దరికి పాజిటివ్‌ వచ్చింది. యాభాజీగూడలో ఒకరికి, ఖుదావంద్‌పూర్‌లో ఒకరికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. కులకచర్లలో 30 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. కులకచర్లకు చెందిన వృద్ధురాలికి, బాబుకు పాజిటివ్‌ రాగా, చౌడాపూర్‌లో ఒకరికి వచ్చింది.


ఒకే కుటుంబంలో నలుగురికి..

ధారూరు: మండల పరిధిలోని మైలారంతండాలో ఒకే కుంటుంబానికి చెందిన నలుగురికి కరోనా వైరస్‌ సోకింది.  ధారూరు ఆసుపత్రిలో 22మందికి కోవిడ్‌ పరీక్షలు చేయగా తండాకు చెందిన ఒకే కుటుంబంలోని ముగ్గురితోపాటు మూడేళ్ల బాలుడికి పాజిటివ్‌ వచ్చింది.

Advertisement
Advertisement