Abn logo
Jul 13 2020 @ 17:50PM

నరసాపురంలో తొమ్మిది మందికి కరోనా

నరసాపురం: జిల్లాలో కరోనా వైరస్‌ ఎక్స్‌ప్రెస్‌ వేగంతో అన్ని ప్రాంతాల్లోనూ దూసుకుపోతోంది. నరసాపురంలో తొమ్మిది మందికి కరోనా నిర్ధారణ అయింది. నరసాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న ఏడుగురికి, పురపాలక కార్యాలయం శానిటరీ విభాగానికి చెందిన అధికారికి పాజిటివ్ వచ్చింది. తూర్పుగోదావరి జిల్లాలో పనిచేస్తూ నరసాపురంలో నివాసం ఉంటున్న బ్యాంక్ అధికారికి కూడా కరోనా సోకింది.

Advertisement
Advertisement
Advertisement