Abn logo
Sep 30 2020 @ 03:31AM

అదుపులోకి కరోనా!

  • ఆశలు రేకెత్తిస్తున్న ‘ఆర్‌-వ్యాల్యూ’!! 
  • భారత్‌లో వారం రోజులుగా 1కి దిగువనే  

న్యూఢిల్లీ, సెప్టెంబరు 29 : గత ఆరు నెలల వ్యవధిలో దేశంలో కొవిడ్‌-19 కేసుల సంఖ్య  ఏకంగా 60 లక్షలు దాటింది. వైరస్‌ వ్యాప్తిపై భయాలు మిన్నంటిన ప్రస్తుత తరుణంలో ఆశలు రేకెత్తించే ఓ పరిణామం అమెరికాలోని మిచిగాన్‌ వర్సిటీ, కొవిడ్‌-ఇండ్‌ స్టడీ గ్రూప్‌ సంయుక్త అధ్యయనంలో వెలుగుచూసింది. సెప్టెంబరు 21 నుంచి దేశంలో కరోనా ‘రిప్రొడక్షన్‌ రేటు’ (ఆర్‌ వ్యాల్యూ) 1 కంటే దిగువనే ఉందని వెల్లడైంది. వైరస్‌ వ్యాప్తి అదుపులోకి వస్తోందనేందుకు.. దీన్ని ఒక సానుకూల సంకేతంగా మిచిగాన్‌ వర్సిటీ ప్రొఫెసర్‌ భ్రమర్‌ ముఖర్జీ అభివర్ణించారు. ఇన్ఫెక్షన్‌ సోకిన ఒక వ్యక్తి నుంచి ఎంతమందికి వైరస్‌ ప్రబలుతోంది? అనేది సూచించే సంఖ్యనే ‘రిప్రొడక్షన్‌ రేటు’ అంటారు. భారత్‌లో ప్రస్తుతం ఆ రేటు 1 కంటే దిగువన ఉంది. అంటే.. వైరస్‌ సోకిన ఒక వ్యక్తి నుంచి సగటున ఒకరి కంటే తక్కువ మందికే ఇన్ఫెక్షన్‌ సోకుతోందన్న మాట. 

Advertisement
Advertisement
Advertisement