Abn logo
Jul 15 2020 @ 10:16AM

భారత్‌లో 10లక్షల చేరువలో కరోనా కేసులు

న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ ఉగ్రరూపం దాలుస్తోంది. రోజు రోజుకు కేసులు పెరుగుతున్నాయి. అటు మరణాల సంఖ్య విపరీతంగా పెరుగుతోంది. ఈ నెల 1వ తేదీ నుంచి 14వ తేదీ ఉదయం వరకు అంటే రెండు వారాల్లోనే అధికారిక గణాంకాల ప్రకారం 3,21,259 పాజిటీవ్ కేసులు నమోదయ్యాయి. 6,327 మంది ప్రాణాలు కోల్పోయారు. గడిచిన మూడు రోజుల్లోనే సుమారు లక్ష కేసులు నమోదయ్యాయి. దేశంలో రికవరీ రేటు పెరుగుతోందని కేంద్రం చెబుతున్నా.. అంతకంటే ఎక్కువగా వైరస్ వ్యాప్తి చెందడంతో ప్రజలు తీవ్ర భయాందోళనకు గురౌతున్నారు. 


దేశవ్యాప్తంగా మొత్తం కేసుల సంఖ్య 10 లక్షలకు చేరవవుతుండడం కలవరపెడుతోంది. ఇప్పటి వరకు 5,71,460 మంది కోలుకున్నారు. 3,11,565 మంది చికిత్స పొందుతున్నారు. ఇక కరోనా తీవ్రత అత్యధికంగా ఉన్న మహారాష్ట్రలో గడిచిన ఒక్క రోజులోనే 6,497 కేసులు నమోదయ్యాయి. కొత్తగా 193 మంది మరణించారు. అక్కడ మొత్తం కేసుల సంఖ్య 2,60,924కు చేరింది. మహారాష్ట్రలో 10,482 మంది మరణించారు.

Advertisement
Advertisement
Advertisement