Abn logo
Dec 2 2020 @ 11:44AM

కారుమూరికి కరోనా.. ధృవీకరించని కార్యాలయం

అమరావతి: అసెంబ్లీలో కరోనా కలకలం రేపింది. మూడు రోజులుగా ఏపీ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న విషయం తెలిసిందే. ఈ సమావేశాలకు హాజరైన తణుకు ఎమ్మెల్యే కారుమూరి నాగేశ్వర రావుకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు సమాచారం. దీంతో కారుమూరితో రెండు రోజులుగా కలిసి ఉన్న ఓ ఎమ్మెల్యేకు టెన్షన్ మొదలైంది. అసెంబ్లీలో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.నిన్న అసెంబ్లీలో కారుమూరి ప్రసంగించారు. అయితే పాజిటివ్ రావడంతోనే ఈ రోజు అసెంబ్లీకి దూరంగా ఉన్నారని తెలుస్తోంది. తణుకు ఎమ్మెల్యే కారుమురి నాగేశ్వరరావుకు కరోనా పాజిటివ్ అనేది వట్టి పుకార్లేనని ఆయన సహచరులు వెల్లడించారు. కారుమూరికి పాజిటివ్ అన్న వ్యాఖ్యలను ఆయన కార్యాలయం ధృవీకరించలేదు. 


Advertisement
Advertisement
Advertisement