Abn logo
Sep 21 2020 @ 00:23AM

కొనసాగుతున్న ‘కరోనా’ ఉధృతి

Kaakateeya

జిల్లాలో 8,812 పాజిటివ్‌ కేసులు

కొవిడ్‌ బారిన పడి 39 మంది మృత్యువాత

భయకంపితులవుతున్న ప్రజలు


మంచిర్యాల, సెప్టెంబరు 20: జిల్లాలో కరోనా విజృంభిస్తోంది. నిత్యం వందకుపైగా కేసులు నమో దవుతుండటంతో ప్రజలు భయకంపితులు అవుతు న్నారు. సీజనల్‌ వ్యాధులైన సాధా రణ జలుబు, జ్వ రం సోకినా వణికిపోతున్నా రు. వైద్య ఆరోగ్యశాఖ ఆధ్వర్యంలో మండలాల వారీగా ప్రాథమిక ఆరో గ్య కేంద్రాల్లో కొవిడ్‌ పరీ క్షలు ప్రారంభించిన తరు వాత పాజిటివ్‌ కేసుల సంఖ్య విపరీతంగా పెరిగి పోయింది. వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపిన ప్రకారం జిల్లాలో ఇప్పటి వరకు 8,812 మంది కరోనా బారిన పడగా 39 మంది మృతి చెందారు. వైరస్‌ బారిన పడ్డ వారిలో 98 శాతానికి పైగా రోగులు కోలుకుం టుండం శుభపరిణామం. అయితే వ్యాధి బారిన పడి ఆరోగ్య వంతులకంటే ఇతర శరీర రుగ్మతలు, దీర్ఘ వ్యాధులు ఉన్నవారే అధిక సంఖ్యలో  ప్రాణాలు కోల్పోతున్నట్లు తెలుస్తోంది.  


పెరుగుతున్న మరణాలు...

కరోనా వ్యాధి బారినపడి మరణిస్తున్న వారి సం ఖ్య జిల్లాలో పెరుగుతోంది. చెన్నూరు మండ లం ముత్తెరావుపల్లిలో కరోనాతో మహిళ మృతి చెందింది మొదలు ఇప్పటి వరకు జిల్లాలో 39 మరణాలు నమోదయ్యాయి. జిల్లా కేంద్రంలోని చింతపండు వాడలో ఒకే కుటుంబంలో ముగ్గురు వ్యక్తులు మృతి చెందడం ఇక్కడ తీవ్ర విషా దాన్ని నింపింది. తండ్రి మరణించిన 15 రోజులకే కొడుకు మరణించడం, నెల రోజుల వ్యవధిలో మరో కుమారుడు మృతి చెం దడం ఆ కుటుంబ సభ్యులను కలచి వేసింది. వీరు ముగ్గు రు హైద్రాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పరత్రిలో చికి త్స పొందుతూ మరణించగా, దాదాపు రూ. 1.5 కోట్లు ఖర్చయినట్లు సమా చారం. అలాగే జిల్లా వ్యాప్తంగా విఽవిధ ప్రాంతాల్లో మరణాల సంఖ్య పెరగడం ఆందోళనక రంగా మారింది. 


చికిత్స పేరుతో దోపిడి....

కరోనా చికిత్స పేరుతో కొన్ని ప్రైవేటు ఆస్పత్రుల్లో దోపిడీకి పాల్పడుతున్నట్లు ఆరోప ణలు ఉన్నాయి. కొవిడ్‌ లక్షణాలతో ఆస్పత్రిలో చేరే వారి నుంచి రోజుకు రూ.50వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నట్లు సమాచారం. జిల్లా కేంద్రంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కరోనా పాజిటివ్‌తో చేరిన ఓ పేషెంటు ఆరు రోజుల పాటు చికిత్స పొందాడు. ఇతనికి రూ. 2 లక్షల 60 వేల బిల్లు వేసినట్లు సమాచారం.  జిల్లా కేంద్రంలో ప్రస్తుతం సుమారు 10 ఆస్పత్రుల్లో కరో నా చికిత్స అందిస్తున్నారు. వీటిలో ఎలాంటి అను మతులు లేకుండా, అనధికారికంగా చికిత్స అంది స్తున్న ఆస్పత్రులే ఎక్కువగా ఉన్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో కొవిడ్‌ పరీక్షలు చేస్తున్న ప్పటికీ అక్కడ విపరీతమైన రద్దీ ఉంటుం డటంతో విధి లేని పరి స్థితుల్లో వైరస్‌ లక్షణా లుగల వారు ప్రైవేటు ఆస్ప త్రులను ఆశ్రయి స్తున్నారు. అలాగే ప్యాకేజీల పేరుతోనూ దొరికనంత దోచుకుంటున్నారు.


సొంత వైద్యానికే పెద్దపీట..

ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఐసోలేషన్‌ సౌకర్యం తక్కు వగా ఉండటం, ప్రైవేటు హాస్పిటళ్లలో అధికంగా ఫీజులు వసూలు చేస్తుండటంతో వైరస్‌ లక్షణాలు గల ప్రజలు సొంత వైద్యానికే పెద్దపీట వేస్తున్నారు. అసలు వ్యాధి బారిన పడకుండా ప్రజలు ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటూ తమను తాము కాపాడుకు నేందుకు ప్రయత్నిస్తున్నారు. కరోనా వ్యాధిపై అవగా హన రావడంతో ఇంటి వద్ద అవసరమైన మందు లు, ఇతర సామగ్రిని అందుబాటులో ఉంచుతున్నా రు. ప్రస్తుతం ప్రతి ఇంట్లో దాదాపు ఆవిరి యం త్రంతోపాటు ఆక్సీమీటర్‌, పల్స్‌ మీటర్‌, శానిటైజర్లు, ఇతర పరికరాలు ఉంచుకుంటున్నారు. జలుబు, దగ్గు, ఆయాసం, జ్వరం తదితర లక్షణాలకు సైతం  మందులు నిలువ ఉంచుకుంటున్నారు. తద్వారా వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు పాటిస్తున్నారు.

Advertisement
Advertisement
Advertisement