Abn logo
Jun 19 2021 @ 21:03PM

నేడు మెగా వ్యాక్సినేషన

జిల్లావ్యాప్తంగా విస్తృత ఏర్పాట్లు

అందుబాటులో 75 వేల డోసులు


నెల్లూరు (వైద్యం), జూన 19 : కరోనా నియంత్రణలో భాగంగా ఆదివారం మెగా వ్యాక్సినేషన కార్యక్రమం  చేపట్టేందుకు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సమాయత్తం అవుతోంది. ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందటంతో ఆ దిశగా విసృత ఏర్పాట్లు చేస్తోంది. 45 ఏళ్లు పైడిన వారితోపాటు ఐదేళ్లలోపు చిన్నారుల తల్లులకు ఈ వ్యాక్సిన వేయనున్నారు. జిల్లాలోని 75 ప్రాఽథమిక ఆరోగ్య కేంద్రాలు, 14 సామాజిక ఆరోగ్య కేంద్రాలు, 14 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, కావలి, గూడూరు ఏరియా ఆసుత్రులు, ఆత్మకూరు జిల్లా ఆసుపత్రి, నెల్లూరు జీజీహెచ ఆసుపత్రులలో కరోనా వ్యాక్సిన వేస్తారు. ప్రత్యేకించి ఐదేళ్లలోపు తల్లులకు కరోనా  టీకా వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. జిల్లా వ్యాప్తంగా 3.30 లక్షల మంది తల్లులు ఉండగా ప్రస్తుతం 46,765 మందికి వ్యాక్సిన వేశారు. ఈ ఏడాది జనవరిలో వ్యాక్సినేషన ప్రారంభమవగా ఇప్పటివరకు 8,58,300 మందికి వాక్సిన వేశారు. ఇందులో మొదటి డోసు కింద 6,56,656 మందికి, రెండవ డోసు కింద 2,16,014 మందికి  టీకా వేశారు. ఇదిలా ఉంటే ఆదివారం చేపట్టనున్న మెగా వాక్సినేషన కార్యక్రమానికి తాజాగా 75 వేల డోసుల  వ్యాక్సిన జిల్లాకు వచ్చింది. ఈ వ్యాక్సినను వైద్యాధికారులు జిల్లావ్యాప్తంగా అన్ని వ్యాక్సిన కేంద్రాలకు పంపిణీ చేశారు. గడిచిన 4 రోజులుగా వ్యాక్సిన పంపిణీ ఆగిపోవడంతో ఆదివారం పెద్ద సంఖ్యలో ప్రజలు  కేంద్రాలకు తరలిరానున్నారు. 


సద్వినియోగం చేసుకోండి


జిల్లావ్యాప్తంగా ఆదివారం చేపట్టనున్న మెగా వ్యాక్సినేషన కార్యక్రమాన్ని జిల్లావాసులు సద్వినియోగం చేసుకోవాలి. 45 ఏళ్లు పైబడిన వారందరికీ వ్యాక్సిన వేస్తున్నాం. అలాగే ఐదేళ్లలోపు తల్లులకు ఆయా కేంద్రాలలో టీకా వేస్తారు. 

- డాక్టర్‌ రాజ్యలక్ష్మి, డీఎంహెచవో