Abn logo
Oct 21 2021 @ 01:02AM

పెంబిలో కార్డన్‌సెర్చ్‌

సీజ్‌ చేసిన వాహనాలతో పోలీస్‌ బృందం

పెంబి, అక్టోబరు 20 : మండల కేంద్రంలో బుధవారం పోలీసుల ఆధ్వర్యంలో కార్డన్‌సెర్చ్‌ నిర్వహించారు. 115 ద్విచక్రవాహనాలు, ఆటోలు 4, ట్రాక్టర్‌ 1, టాటా మ్యాజిక్‌ 1, 2 వేల విలువ చేసే గుట్కాలు పట్టుకున్నారు. డీఎస్పీ ఉపేందర్‌రెడ్డి వాహనదారులతో సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ... ప్రతీ ఒక్క వాహనదారునికి లైసెన్స్‌, ఇన్సూరెన్స్‌, ఆర్‌సీ తప్పనిసరిగా ఉండాలని అన్నారు. ఈ కార్యక్రమంలో సీఐ అజయ్‌బాబు, ఖానాపూర్‌ ఎస్‌ఐ అశోక్‌, ఎస్సై రాము, దస్తూరాబాద్‌ ఎస్సై రాహుల్‌, కడెం ఎస్సై రాజు, పెంబి ఎస్సై రాజు, సర్పంచ్‌ శేఖర్‌గౌడ్‌, మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ పుప్పాలశంకర్‌, టీఆర్‌ఎస్‌ మండ ల అధ్యక్షుడు సల్ల నరేందర్‌రెడ్డి, ఆర్‌ఎస్‌ఎస్‌ మండల కన్వీనర్‌ గోవింద్‌, వైస్‌ ఎంపీపీ గంగారెడ్డి, తదితరులు ఉన్నారు.