Abn logo
Sep 20 2021 @ 23:37PM

వినాయక నిమజ్జనోత్సవంలో వివాదం

చికిత్సపొందుతున్న క్షతగాత్రులు




చెట్టువానిపేట వాసులపై దాడి

ఐదుగురికి తీవ్ర గాయాలు

శ్రీకాకుళం,ఆంధ్రజ్యోతి, సెప్టెంబరు 20 : వినాయక నిమజ్జనోత్సవంలో తలెత్తిన వివాదం దాడికి దారితీసింది. వేడుకలను సెల్‌ఫోన్లలో వీడియోలు తీయవద్దని కోరినందుకు కొంతమంది తమపై దాడికి దిగినట్టు చెట్టువానిపేట గ్రామస్థులు చెబుతున్నారు. ఇందుకు సంబంధించి బాధితులు, రూరల్‌ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నగర సమీపంలో శాస్త్రులవానిపేట, చెట్టువానిపేటలో ఆదివారం వినాయక నిమజ్జనోత్సవాలు జరిగాయి. మహిళలు, యువత పాల్గొన్నారు.  స్థానికేతరులు కొందరు సెల్‌ఫోన్లో ఫొటోలు తీసేందుకు ప్రయత్నించగా స్థానిక యువకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం పెద్దపాడుకు చెందిన కొందరు యువకులు చెట్టువానిపేట వెళ్లారు. రాత్రి ఫొటోలు వద్దని వారించిన యువకులపై దాడికి పాల్పడినట్టు బాధితులు చెబుతున్నారు.  ఈ ఘటనలో కొయ్యాన సింహాచలం, చిన్నారావు, చెట్టు జోగులు, ఇప్పిలి రమేష్‌, భాస్కరరావులకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులు ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆదివారం రాత్రే పోలీసులకు ఫిర్యాదు చేశామని...అప్పుడే స్పందించి ఉంటే దాడి ప్రయత్నం జరిగి ఉండేది కాదని బాధితులు చెబుతున్నారు. బాధితుల ఫిర్యాదు మేరకు రూరల్‌ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.